సాగర్ ఆయకట్టు చివరి భూములకు నీరందక ఇక్కట్లు..!

సాగర్ ఆయకట్టు చివరి భూములకు నీరందక ఇక్కట్లు..!

మిర్యాలగూడ, అక్టోబర్ 14 , మన సాక్షి :

నాగార్జునసాగర్ ఎడమ కాలువకు పంట పొలాల కోసం నీటి విడుదల చేసినా.. చివరి భూములకు నీరందక పంటలు ఎండిపోతున్నాయి. దాంతో రైతులు ఇక్కట్లకు గురి అవుతున్నారు.

శనివారం
మిర్యాలగూడ మండలం ములకల కాలువ మేజర్ ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కాకునూరి బసవయ్య గౌడ్ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది . ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు గత పది రోజులుగా సాగరు పరిధిలో ప్రభుత్వం నీరు విడుదల చేసింది. కానీ అర కొర నీటిని విడుదల చేయటం వలన చివరి భూములకు నీరు అందక పంట పొలాలు, మినప చేలు ఎండిపోతాయన్నారు.

ALSO READ : Online History : మీ ఆన్ లైన్ చరిత్ర అంతా అక్కడుంది.. మీరు ఓపెన్ చేసే సైట్లు, పాస్ వర్డ్స్ అన్ని అక్కడ స్టోర్ అవుతాయి.. తెలుసుకోండి ఇలా..!

ఈ ప్రభుత్వం చేసిన తప్పిదం వలన ఈ ప్రాంత రైతులందరూ ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారని, ఉన్న నీటిని కొంచెం పెంచి ఇస్తే ఈ మేజర్ కింద ఉన్న పంట పొలాలు బతికే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాంత రైతులందరూ తరపున మేం మీకు విన్నపం చేస్తా ఉన్నామని నీరుని ఎక్కువగా విడుదల చేయాలని కోరుతున్నామన్నారు.

కాలువను సందర్శించిన వారిలో పిసిసి సభ్యులు చిరుమర్రి కృష్ణయ్య, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, మిర్యాలగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తలకొప్పుల సైదులు, దామరచర్ల మండల నాయకులు కందుల నరసింహారెడ్డి, రైతులు పాల్గొన్నారు.

ALSO READ : Nalgonda Brs : నల్లగొండ బీఆర్ఎస్ లో ముసలం.. పిల్లి రామరాజు యాదవ్ సస్పెన్షన్..!