సాయి సన్నిధిలో కుందూరు రఘువీర్ రెడ్డి ప్రత్యేక పూజలు..!

మండల కేంద్రంలోని శ్రీ సాయి సన్నిధిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కుమారుడు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి బుధవారం సాయిబాబా దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సాయి సన్నిధిలో కుందూరు రఘువీర్ రెడ్డి ప్రత్యేక పూజలు..!

చింతపల్లి, మన సాక్షి.

మండల కేంద్రంలోని శ్రీ సాయి సన్నిధిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కుమారుడు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి బుధవారం సాయిబాబా దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు చైర్మన్ మంచి కమిటీ ధనంజయ ఆలయ కమిటీ సభ్యులు వారిని గుడిలోకి సాదరంగా ఆహ్వానించి వేద పండితులచే ఆశీర్వచనాలు అందజేశారు.

అనంతరం బాబా చిత్రపటం వారికి అంద చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ముచ్చర్ల యాదగిరి గోవింద్ యాదగిరి, పిఎసి చైర్మన్ లింగంపల్లి వెంకటయ్య, కాసారం శ్రీనివాస్, ఎల్లంకి కిషన్, ఎలిమినేటి నరసింహ, ఎండి సలీం, రవి, ఎండి సిద్దిక్ ఆలయ కమిటీ సభ్యులు కోశాధికారి ఊరే కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి కొమిరిశెట్టి వెంకటయ్య, తడక మల్ల శ్రీనివాస్, కుంభం పుల్లారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు.

ALSO READ : Missing : తప్పిపోయిన అమ్మాయి.. తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు..!