Missing : తప్పిపోయిన అమ్మాయి.. తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు..!

నాగిరెడ్డిపేట మండలంలోని ఆత్మకూరు గ్రామానికి చెందిన కర్రే బాగానే గంగమని తన కూతురు సుప్రియ తో కలిసి ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి గ్రామానికి వెళ్ళగా ఫిబ్రవరి 29 రోజున మధ్యాహ్నం మూడు గంటలకు తప్పిపోయిందని ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు .

Missing : తప్పిపోయిన అమ్మాయి.. తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు..!

ఎల్లారెడ్డి, మన సాక్షి:

నాగిరెడ్డిపేట మండలంలోని ఆత్మకూరు గ్రామానికి చెందిన కర్రే బాగానే గంగమని తన కూతురు సుప్రియ తో కలిసి ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి గ్రామానికి వెళ్ళగా ఫిబ్రవరి 29 రోజున మధ్యాహ్నం మూడు గంటలకు తప్పిపోయిందని ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు .

ఇట్టి విషయం పై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేయగా హైదరాబాద్ లోని కూకట్పల్లి ప్రాంతంలో ని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండగా పట్టుకొని వారి తల్లిదండ్రులకు ఎల్లారెడ్డి సిఐ రవీందర్ నాయక్, ఎస్సై బొజ్జ మహేష్, సిబ్బంది సుప్రీత తల్లిదండ్రులకు బుదవారం అప్పగించారు .ఎట్టి కేసులో టెక్నాలజీ సహాయంతో వెతికి పట్టుకున్న కానిస్టేబుల్ ను సిఐ అభినందించి నగదు రివార్డు అందజేశారు.

ALSO REDY : Miryalaguda : అంతర రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..!