Miryalaguda : అంతర రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..!

గత కొన్ని రోజులుగా నల్గొండ , సూర్యపేట జిల్లాలో రహదారుల వెంబడి పార్క్ చేసి ఉన్న లారిల నుండి డిజిల్ దొంగతలనాలకు పాల్పడుతున్న ఆరుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు మిర్యాలగూడ డిఎస్పీకే రాజశేఖర్ బాబు తెలిపారు.

Miryalaguda : అంతర రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..!

నల్గొండ, మనసాక్షి :

గత కొన్ని రోజులుగా నల్గొండ , సూర్యపేట జిల్లాలో రహదారుల వెంబడి పార్క్ చేసి ఉన్న లారిల నుండి డిజిల్ దొంగతలనాలకు పాల్పడుతున్న ఆరుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు మిర్యాలగూడ డిఎస్పీకే రాజశేఖర్ బాబు తెలిపారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ..  గత కొన్ని రోజులుగా నల్గొండ , సూర్యపేట జిల్లాలోని రహదారుల వెంబడి పార్క్ చేసియున్న లారిలను టార్గెట్ గా చేసి, డ్రైవరులు నిద్రమత్తులో ఉన్న సమయంలో లారీ డీజిల్ ట్యాంక్ తాళాలు పగులగొట్టిగాని లేదా స్క్రూలు తీసిగాని డీజిల్ ను దొంగిలించుకొని ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఇన్నోవా వాహనాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి తరలించుచు నేరాలకు పాల్పడుతు ఉన్నారని డిఎస్పి తెలిపారు.

ముఠాను నల్గొండ ఎస్పీ చందనా దీప్తి ఆదేశాల మేరకు, మిర్యాలగూడ రాజశేఖర్ రాజు, గారి పర్యవేక్షణలో, మిర్యాలగూడ రూరల్ వీరబాబు గారి ఆద్వర్యంలో వాడపల్లి ఎస్‌ఐ వారి సిబ్బంది మరియు సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణు సహాయంతో ఇట్టి నేరాలకు పాల్పడుతున్న నేరస్తులను పట్టుకొని పలు నేరాలు చేధించి తదుపరి నేరములు కాకుండా అడ్డుకొని అద్భుతమైన ప్రతిభతో పోలీస్ లపై ప్రజలకు ఉన్న నమ్మకాని మరింత పెంచడం జరిగినదన్నారు.నల్గొండ జిల్లాలో నేరాలు చేస్తే పోలీస్ లకు పట్టుబడుతమనే భయాన్ని నేరస్తులకు కలిగించడం జరిగినదన్నారు.

ALSO READ : BIG BREAKING : పరిశ్రమలో రియాక్టర్ పేలి నలుగురు మృతి.. మృతుల కుటుంబ సభ్యుల ఆందోళన

నేరస్తులైన బాణావత్ బాలబద్దునాయక్ బానావత్ గోవింద్ నాయక్ మేరాజ్ శ్రీను నాయక్ మూడవ వెంకటేశ్వర్లు నాయక్ వచ్చా రాజు నాయక్ మేరాజ్ బాబ్రీ నాయక్ లను అరెస్టు చేసి వీరి వద్ద నుండి ఆరు లక్షల రూపాయల నగదు 700 లీటర్ల డీజిల్ మూడు ఇన్నోవా వాహనాలు ఒక బోలోరే వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు .

వీరు వారి సొంత గ్రామం సీతారాంపురం తండా, పల్నాడు జిల్లా నుండి 3 ఇన్నోవా వాహనాలు మరియు జైలో వాహనాలలో రాత్రి సమయంలో నల్గొండ సూర్యపేట జిల్లా పరిదిలోని హైవే ల వెంబడి పార్క్ చేయబడి ఉన్న లారి లను టార్గెట్ గా చేసి, డ్రైవరులు నిద్రమత్తులో ఉన్నది గమనించి లారీ డీజిల్ ట్యాంక్ తాళాలు పగులగొట్టిగాని లేదా స్క్రూలు తీసిగాని పైప్ సహాయంతో డీజిల్ ను క్యాన్ లలో నింపుకొని వారి యొక్క ఇన్నోవా, జైలో వాహనాలలో ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలించి , దొంగిలించిన డీజిల్ ను అమ్ముకొని సొమ్ము చేసుకునేవారు.

అదేవిధంగా గత నెల రోజులుగా దామరచర్ల మండలం కొండ్రపోల్ గ్రామానికి చెందిన నేనవత్ టాగూరు అను అతడు వీరి వద్ద నుండి సుమారు 1500 లీటర్ల డిజిల్ ను తక్కువ దరకు కొనుగోలు చేయడం జరిగినది. సదరు వ్యక్తి నుండి ప్రస్తుతం 700 లీటర్ల డిజిల్ ను స్వాదినపరుచుకొనైనది. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని తెలిపారు.

ALSO READ : PDS RICE : అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్సు పోలీసులు..!

నేర పరిశోధనలో భాగంగా ఈ రోజు అనగా తేదీ 06.03.2024 రోజు తెల్లవారు జాము సమయమున వాడపల్లి ఎస్సై తన సిబ్బంధి తో కలసి పెట్రోల్లింగ్ లో భాగంగా బార్డర్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనికి చేయుచుండగా అదే సమయంలో సదరు నేరస్తులు ఆరుగురు రెండు రెండు ఇన్నోవా వాహనాలలో ఆంద్ర వైపుకు వెళ్తుండగా, వారిపై అనుమానం కలిగి వాహనాలను తనికి చేయగా వాటినందు డీజిల్ క్యాన్ లు మరియు పైప్ లు కలిగి ఉండగా వారిని పట్టుబడు చేసి విచారించగా సదరు వ్యక్తులు తాము చేసిన నేరం ను ఒప్పుకున్నారు.

ALSO READ : Nagar Karnool : పట్టుదల ఉంటే పేదరికం అడ్డు రాదని నిరూపించిన యువకుడు.. ఒకేసారి నాలుగు ఉద్యోగాలు..!