PDS RICE : అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్సు పోలీసులు..!

PDS RICE : అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్సు పోలీసులు..!

లక్షేట్టిపేట్ , (మన సాక్షి);

రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాసులు ఐపీఎస్ (ఐజీ)ఆదేశాల మేరకు లక్షేట్టిపేట్ పోలీస్ స్టేషన్ పరిధి చుట్టప్రక్కల ప్రాంతాల నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసి లక్షట్ పేట్ మున్సిపాలిటీ పరిధిలోని సత్యసాయినగర్ లో ఒక షెడ్ లో నిల్వ ఉంచారనే నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం అర్ధరాత్రి జామున టాస్క్ ఫోర్సు ఎస్ఐ ప్రసాద్, సిబ్బంది రాకేష్, రాజు తో కలిసి తనిఖీలు నిర్వహించగా 15 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. దొరికిన పిడియస్ రైస్ సత్య సాయి నగర్ కాలనీకి చెందిన గుర్రాల కిషన్ గా గుర్తించారు. తదుపరి విచారణ లక్షేట్టిపేట్ పోలీస్ స్టేషన్ వారికి అప్పగించడం జరిగింది.

ALSO READ : Nagar Karnool : పట్టుదల ఉంటే పేదరికం అడ్డు రాదని నిరూపించిన యువకుడు.. ఒకేసారి నాలుగు ఉద్యోగాలు..!