క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Sand : అర్ధరాత్రి అక్రమంగా ఇసుక రవాణా.. వరుసగా లారీల పట్టివేత..!

Sand : అర్ధరాత్రి అక్రమంగా ఇసుక రవాణా.. వరుసగా లారీల పట్టివేత..!

కేతేపల్లి, మనసాక్షి :

నల్గొండ జిల్లాలో అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు లారీలను పట్టుకొని సీజ్ చేశామని కేతపల్లి ఎస్సై యు. సతీష్ తెలిపారు. ఆయన తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జాతీయ రహదారి 65 పై కొర్లపహాడ్ టోల్గేట్ వద్ద మంగళవారం రాత్రి తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా కనిపించిన మూడు లారీలను తనిఖీ చేశామని అని తెలిపారు.

ఎటువంటి అనుమతులు లేకుండా టీఎస్ 05 యుఈ 4142, టీఎస్ 07 యూకే 1389, టీజీ 30 టీ 2358 ఈ నెంబర్లు కలిగిన మూడు లారీలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి సమీపంలో గల వాడపల్లి గ్రామం నుంచి హైదరాబాద్ కు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఆయన తెలిపారు. ఇట్టి లారీలను మూడు లారీలను సీజ్ చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఆయన వివరించారు.

MOST READ : 

  1. Urea : నానో యూరియా, నానో డిఏపి ఏంటి, ఎలా వాడాలి.. రైతులకు అవగాహన..!

  2. ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఆర్టిఏ అధికారి..!

  3. District collector : జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన.. వైద్య సేవలపై కీలక ఆదేశం..!

  4. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్లో ఉంచొద్దు..!

మరిన్ని వార్తలు