షాద్ నగర్ : ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

బంజారా జాతిని సన్మార్గంలో నడిపిన మహనీయుడు సంత్‌ సేవాలాల్‌ మహరాజ్ అని ఆయన చూపిన మార్గంలో అందరూ నడవాల్సిన ఆవశ్యకత ఉందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో టీచర్స్ కాలనీలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

షాద్ నగర్ : ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

బంజారా జాతిని సన్మార్గంలో నడిపిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్.

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, మనసాక్షి :

బంజారా జాతిని సన్మార్గంలో నడిపిన మహనీయుడు సంత్‌ సేవాలాల్‌ మహరాజ్ అని ఆయన చూపిన మార్గంలో అందరూ నడవాల్సిన ఆవశ్యకత ఉందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో టీచర్స్ కాలనీలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాలు స్థానిక గిరిజన నేతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితర ప్రజా ప్రతినిధులతో పాటు ప్రభుత్వ అధికారులు ఆర్డీవో వెంకట మాధవరావు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఎమ్మెల్యే శంకర్ తదితర ప్రజాప్రతినిధులను సన్మానించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. హింస పాపమని, మత్తు, ధూమ పానం శాపం అని హితవు పలికి బంజారా జాతికే కాదు యావత్తు ఇతర కులాలకు ఆదర్శపురుసుడయ్యారుని అన్నారు.

సేవాలాల్‌ మహరాజ్‌ ఆనాడు బంజార జాతి పరువు ప్రతిష్టల గురించి ముందుగానే ఊహించి అహింస సిద్ధాంతానికి పునాది వేసి ఆచరించి చూపారనీ ఆ తరుణంలో బంజారాలు ఆనాడు రాజుల కాలం నుంచి బ్రిటిష్‌ కాలం వరకు ఆయా రాజ్యాలకు అవసరమైన యుద్ధ సామాగ్రిని చేరవేస్తూ సంచార జీవనం సాగిస్తూ ఉండేవారన్నారు. ఆ క్రమంలో బ్రిటిష్‌, ముస్లీం పాలకుల మత ప్రచారం ద్వారా బంజారా సమాజం అనేక ఇబ్బందులకు గురి అయ్యింది.

ఈ పరిస్థితులలో బంజారా జాతిని సన్మార్గంలో నడిపించేంందుకు సేవాలాల్‌ మహారాజ్‌ అవతరించారనీ, సేవాలాల్‌ మహరాజ్‌ బోధనల ద్వారా బంజారా జాతి పురోగమిస్తుందని అన్నారు. కులమత వర్గ విభేదాల పతీతంగా ప్రతి ఒక్కరూ మహనీయుల ఆశయాల అడుగుజాడలలో నడవాల్సిన అవసరం ఉందన్నారు.

రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు గిరిజనుల సంక్షేమం అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ అధ్యయమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.