తెలంగాణBreaking Newsకామారెడ్డి జిల్లాజిల్లా వార్తలు

District collector : సారూ.. మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే కట్టుకుంటాం.. జిల్లా కలెక్టర్ ను వేడుకున్న నిరుపేద..!

District collector : సారూ.. మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే కట్టుకుంటాం.. జిల్లా కలెక్టర్ ను వేడుకున్న నిరుపేద..!

కామారెడ్డి జిల్లా దోమకొండ, మన సాక్షి :

సారూ.. మేము నిరుపేదలము, ఇల్లు కూడా లేదు. మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే కట్టుకుంటాం సారూ.. కలెక్టర్ కు వేడుకున్న నిరుపేద… కామారెడ్డి జిల్లా కలెక్టర్ ను ఆ జిల్లాలోని దోమకొండ మండల కేంద్రంలో ఓ నిరుపేద కుటుంబం వేడుకుంది.

అర్హత కలిగిన నిరుపేద కుటుంబాలకు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. దోమకొండ మండల కేంద్రం లోని షేక్ అల్మా బేగం, భర్త – సద్దాం పాషా ఇంటిని శనివారం పరిశీలించారు.

తాను, తన భర్త కూలీ పనిచేస్తూ ఇద్దరు పిల్లల కుటుంబాలతో నివసిస్తున్నామని. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలనీ జిల్లా కలెక్టర్ ఆశిష్ ను కోరారు. ప్రస్తుతం ఉన్న ప్లాస్టిక్ కవర్స్ లతో కప్పబడి ఉన్న ఇంటిలో గత 20 సంవత్సరాల నుండి నివసిస్తున్నామని.తన కున్న ఇంటి స్థలంలో ఇల్లు కట్టుకుంటానని తెలిపారు.

ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల రూపాయలతో పాటు ఇతర మార్గాల ద్వారా, ఇల్లు నిర్మించుకుంటానని ఆమే తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారిని జ్యోతి ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి, అధికారులు సిబ్బంది ఉన్నారు.

MOST READ : 

  1. District collector : ప్రతి రైతుకు ఆధార్ తరహాలో భూధర్ కార్డు.. జిల్లా కలెక్టర్ వెల్లడి..!

  2. Haythnagar : హయత్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం.. 30 కి పైగా గుడిసెలు దగ్ధం..!

  3. Big Alert : ఈ పేరుతో ఫోన్ కాల్స్, వాట్సప్ మెసేజ్ లు వస్తే జాగ్రత్త.. లేదంటే మీ ఖాతా ఖాళీ..!

  4. District Collector : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అకౌంట్ లో బిల్లులు జమ.. జిల్లా కలెక్టర్..!

  5. Miryalaguda : భూభారతిలో ప్రతి ఏటా డిసెంబర్ 31న భూముల వివరాల ప్రదర్శన.. జిల్లా కలెక్టర్ వెల్లడి..!

మరిన్ని వార్తలు