తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Nalgonda : సైన్స్ ల్యాబ్ ఆన్ వీల్స్ ప్రారంభం..!

Nalgonda : సైన్స్ ల్యాబ్ ఆన్ వీల్స్ ప్రారంభం..!

నల్గొండ, మనసాక్షి :

తెలంగాణా డెవలప్మెంట్ ఫోరమ్ ప్రతిష్టత్మ క ప్రాజెక్ట్ సైన్స్ ల్యాబ్ ఆన్ వీల్స్ ను భువనగిరి జిల్లా బిబినగర్ మండలం గూడూరు గ్రామంలోని జ డ్ పి హె చే స్ పాఠశాలలో వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు విద్యాశాఖ అధికారుల సమక్షంలో ప్రొఫెసర్ కోదండ రామ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం టీ డి ఫ్ అమెరికా అధ్యక్షుడు శ్రీనివాస్ మాణికొండ ప్రారంభోపన్యాసంతో మొదలై, అనంతరం మహేంద్ర గూడూరు యొక్క కీలక ప్రసంగంతో ముగిసింది తెలంగాణ మన బడి ప్రాజెక్టులో భాగంగా తీసుకురాబడిన సైన్స్లబ్ ఆన్ వీల్స్ యొక్క ముఖ్య ఉద్దేశాలను వివరించారు.

ఆ తర్వాత ప్రొఫెసర్ కొదండరాం వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సైన్స్ సబ్జెక్టులను వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా బోధించడం ఒక విప్లవాత్మక ముందడుగు అని ప్రశంసించారు.

రాబోయే 5 సంవత్సరాలలో రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులందరికీ వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా ప్రాక్టికల్స్ చేయించి వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడం టీ డి ఫ్ లక్ష్యం అని అమెరికా అధ్యక్షుడు శ్రీనివాస్ మాణికొండ చెప్పారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవలసిన మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్యమంత్రి తో మహబూబ్‌నగర్ లో ఉన్నందున తన సందేశాన్ని గోనారెడ్డి ద్వారా అందజేశారు. టీ డి ఫ్ ప్రతినిధులు మహేంద్ర గూడూరు మరియు శ్రీనివాస్ మాణికొండకు అభినందనలు తెలుపుతూ, ఈ కార్యక్రమంలో తమ స్వచ్ఛంద సంస్థ “కొమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్” భాగస్వామిగా ఉంటుందని, పూర్తిగా సహకరించనున్నట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి, స్సీ ఈ ర్ టీ మాజీ డైరెక్టర్ ఆనంద్ కిశోర్, డి ఈ ఓ సత్యనారాయణ, మాజీ డి ఈ ఓ నారాయణ రెడ్డి, బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ గద్దం బాల్ రెడ్డి, యూత్ ఫర్ సేవ కన్వీనర్ స్వరూప రాణి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు ప్రదర్శించిన ప్రాక్టికల్స్ అందరి ప్రశంసలు అందుకున్నాయి. అనంతరం అతిథులను మెమెంటోలతో సత్కరించారు.

MOST READ :.

మరిన్ని వార్తలు