మిర్యాలగూడ : స్కూటీ మీద తిరుగుతూ గంజాయి విక్రయం, పోలీసులకు చిక్కిన నిందితుడు

మిర్యాలగూడ : స్కూటీ మీద తిరుగుతూ గంజాయి విక్రయం, పోలీసులకు చిక్కిన నిందితుడు

మిర్యాలగూడ , మనసాక్షి

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఓ వ్యక్తి స్కూటీ మీద తిరుగుతూ గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మిర్యాలగూడ టూ టౌన్ సిఐ నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం … పట్టణంలోని సీతారాంపురం కాలనీకి చెందిన వాసా సాయి శంకర్ వ్యసనాలకు బానిస అయ్యాడు. డబ్బు సంపాదనకు గంజాయి ప్యాకెట్లు విక్రయిస్తున్నాడు.

 

హనుమాన్ పేట ఫ్లైఓవర్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు విచారించారు . గాంధీ నగర్ కు చెందిన ఒక వ్యక్తి నుంచి గంజాయి కొని స్కూటీ మీద తిరుగుతూ అధిక రేట్లకు విక్రయిస్తున్నట్లుగా తేలింది. అతని వద్ద నుంచి 1.5 కేజీల గంజాయి స్కూటీ సెల్ఫోన్ స్వాధీనం చేసుకొని కోర్టుకు డిమాండ్ చేశారు.

కేసును చేదించిన సీఐ నరసింహారావు ఎస్సైలు సైదిరెడ్డి , సుధీర్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, రామకృష్ణ, అక్బర్ డిఎస్పి అభినందించారు.