నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు  – ఎస్ ఐ. లోకేష్

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు 
– ఎస్ ఐ. లోకేష్

మునగాల , మనసాక్షి :

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని మునగాల ఎస్సై లోకేష్ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో ఉన్న విత్తన దుకా ణాలను మండల వ్యవసాయ అధికారి బి అనిల్ కుమార్ తో కలిసి తనిఖీ చేశారు.

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలం సీజన్ ను దృష్టిలో ఉంచుకొని విత్తనాలు దుకాణాలను తనిఖీ చేస్తున్నామన్నారు. రైతులు లైసెన్స్‌ కలిగిన దుకాణాల్లోనే విత్తనాలు కొను గోలు చేయాలన్నారు. ముఖ్యంగా పత్తి, మిర్చి విత్తనాలు కొనుగోలు చేసే టప్పుడు దుకాణం యజమాని దగ్గర రశీదు తీసుకోవాలని సూచించారు.

 

నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై రశీదు ఆధారంగా చర్యలు తీసుకోవ చ్చన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు అమ్మే వారి సమాచారం ఇవ్వాలని కోరారు. అనుమతులు లేకుండా విత్తనాలను రైతులకు అధిక ధరలకు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.