నకిలీ విత్తనాల నియంత్రణకు స్పెషల్ టాస్క్ఫోర్స్.. సమాచారం ఇస్తే చాలు

నకిలీ విత్తనాల నియంత్రణకు స్పెషల్ టాస్క్ఫోర్స్.. సమాచారం ఇస్తే చాలు
జగిత్యాల ప్రతినిధి,(మన సాక్షి):
జగిత్యాల జిల్లా పరిధిలో నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందింతే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పి ప్రజలకు, రైతులకు సూచించారు. వానాకాలం సాగు ప్రారంభమవుతున్న వేళను దృష్టిలో వుంచుకోని రైతన్న నకిలీ విత్తనాల బారీన పడకుండా ముందస్తు చర్యలకై జిల్లా పోలీసులు సిద్ధంగా ఉంది అని నకిలీ విత్తనాల సరఫరా ,ఉత్పత్తి, అమ్మకాలు అరికట్టడానికి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ శాఖ వారు అధికారులతో ప్రత్యేక స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది.
స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రాజు -8712656807, సిసిఎస్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు – 8712656810, సిసిఎస్ ఎస్సై సధాకర్- 8712573691 ఎవరైన వ్యాపారస్థులు, సంస్థలు, వ్యక్తులు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందితే తక్షణమే టాస్క్ఫోర్స్ ఫోన్ నంబర్ లకు లేదా స్థానిక పోలీసులకుగాని సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా వుంచబడటంతో పాటు, కీలక సమచారం అందించిన వ్యక్తులకు పారితోషకాలను అందించడం జరుగుతుందని ఎస్పి తెలిపారు.
అదేవిధంగా రైతులు విత్తనాలను వ్యవసాయ శాఖ నిర్దేశించిన దుకాణాల్లో మాత్రమే ఖరీదు చేయడం మంచిదని జిల్లాలో ఎవరైనా నకిలీ విత్తనాలు సరఫరా,అమ్మకాలు జరిపితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పి.డి.యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.