Vehicle Inspections : వాహనాల తనిఖీల్లో నోట్ల కట్టలు.. పోలీసుల పట్టివేత..!
Vehicle Inspections : వాహనాల తనిఖీల్లో నోట్ల కట్టలు.. పోలీసుల పట్టివేత..!
నారాయణపేట టౌన్, మన సాక్షి :
జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఆదేశాల మేరకు పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అంతర్ జిల్లా చెక్పోస్ట్ అయినా మరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్ కోట చెక్ పోస్ట్ దగ్గర శుక్రవారం మరికల్ సిఐ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీల్లో భాగంగా చెక్ పోస్ట్ దగ్గర 8,40,000/- రూపాయలను పట్టుకొని సీజ్ చేయడం జరిగిందనీ తెలిపారు.
ఇట్టి డబ్బులను దేవరకద్ర మండలం గురకొండ గ్రామానికి చెందిన కింగురి బీరప్ప అనే వ్యక్తి దగ్గర నుండి డబ్బులను పట్టుకొని సీజ్ చేయడం జరిగింది అని అతను ఎటువంటి ఆధారాలు చూపించకపోవడం తో డబ్బు ను సీజ్ చేసి గ్రివియస్ కమిటీ ముందు ప్రవేశ పెట్టడం జరుగుతుందని సిఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రజలు 50 వేల రూపాయల కంటే ఎక్కువ డబ్బులను తీసుకువెళ్లే సమయంలో తగిన పత్రాలు చూయించాలని సిఐ తెలిపారు.










