Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక..!
Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక..!
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని పలు గ్రామాలలో శనివారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు.
మండల పరిధిలోని దామరగిద్ద , ముర్కుంజాల్, బాన్సువాడ, చౌకన్ పల్లి, సుక్కల్ తీర్ధ్ , గాజుల పాడ్, రాజారాం తండా, తడ్కల్ ,ఘనపూర్, చందర్ తండా, నాగూర్ (కె) గ్రామాల్లో తహసిల్దార్ సి, భాస్కర్ , ఎంపిడిఓ సత్తయ్య , ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ ప్రత్యేక అధికారుల, కార్యదర్శుల అధ్యక్షతన ఇందిరమ్మ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక నిర్వహించారు.
శనివారం గ్రామపంచాయతీ కార్యదర్శులు ప్రజా పాలనలో దరఖాస్తులు ఇచ్చిన లబ్ధిదారుల పేర్లను చదివారు అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని వారు అన్నారు. అర్హులైన లబ్ధిదారులను ఎల్ 1 లిస్ట్ నుంచి ఎంపిక చేయడం జరిగిందని ఎంపిడిఓ సత్తయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామాల పెద్దలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉన్నారు.
MOST READ :
-
TG News : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఆ రోజే.. ప్రభుత్వం కీలక ప్రకటన..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు భారీ షాక్.. కేంద్రం ఆ నిర్ణయం తీసుకుంటే ఇక భారమే..!
-
Gold Price : బంగారం కొనుగోలుకు మహిళల ఆసక్తి.. ఈరోజు తులం ధర ఎంతంటే..!
-
Tea : రోడ్ సైడ్ టీ భలే టేస్ట్ గా ఉందా.. అయితే ఈ సీక్రెట్ తెలిస్తే మళ్లీ ఎప్పుడు తాగరు..!
-
TG News : మూడు నెలలుగా జీతాలేవీ.. బతికేదెట్లా..!









