NALGONDA: రాష్ట్రస్థాయికి క్రీడాకారుల ఎంపిక..!

నల్గొండ జిల్లా స్థాయిలో జరిగిన బాల బాలికల క్రీడల పోటీలలో రాష్ట్రస్థాయికి క్రీడాకారులను ఎంపిక చేశారు.

NALGONDA: రాష్ట్రస్థాయికి క్రీడాకారుల ఎంపిక..!

నాగార్జనసాగర్, మన సాక్షి :

ఈనెల 30వ తారీఖున నల్లగొండ జిల్లా మేకల అభినవ్ స్టేడియం నందు అండర్ 8 సంవత్సరాల బాల బాలికలు అండర్ 10 సంవత్సరాల బాల బాలికలు మరియు అండర్ 12సంవత్సరాల బాల బాలికలు విభాగంలో జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్స్ నందు రాష్ట్ర స్థాయికి ఎంపికైన సెయింట్ జోసెఫ్ స్కూల్ విద్యార్థులు.

8 సంవత్సరాల విభాగంలో 50 మీటర్స్ రన్నింగ్ లో యోజిత 2 స్థానం 10 సంవత్సరాల విభాగంలో 100 మీటర్స్ లో గౌతమి 1వ స్థానం అండర్ 12 సంవత్సరాల విభాగంలో షర్మిల లాంగ్ జంప్ 1వ స్థానం 100 మీటర్స్ లో 2వ స్థానం దీక్షిత లాంగ్ జంప్ 2వ స్థానం అలాగే అండర్ 12 సంవత్సరాల లో లాంగ్ జంప్ లో నిఖిలేష్ 1వ స్థానం మరియు నజీబ్ లాంగ్ జంప్ 2వ స్థానం సాధించారు.

వీరు 7-7-2024 తేదీలలో రంగారెడ్డిజిల్లా పుల్లల గోపీచంద్ బ్యాట్మెంటన్ అకాడమీ ప్రధాన స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ కిడ్స్ పోటీలకు వెళ్ళనున్నారు వీరిని పాఠశాల హెచ్ఎం సిస్టర్ లలిత ,సిస్టర్ మతినా , మరియు పాఠశాల పి ఈ టి కిరణ్ కుమార్ , అభినందించారు.

ALSO READ : 

T20 World Cup 2024 : టి20 వరల్డ్ కప్ లో.. విశ్వవిజేతగా భారత్..!

T20 world Cup 2024 : టి20 వరల్డ్ కప్ లో డబ్బే.. డబ్బు.. ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే షాక్..!