Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : ఎస్సి, ఎస్టీ కేసులో సంచలనం.. ముగ్గురికి జైలు శిక్ష..!

Nalgonda : ఎస్సి, ఎస్టీ కేసులో సంచలనం.. ముగ్గురికి జైలు శిక్ష..!

మాడుగుల పల్లి, మనం సాక్షి:

ఎస్సి, ఎస్టీ కేసులో ముగ్గురికి ఏడాది జైలు శిక్ష విదిస్తూ నల్గొండ స్పెషల్ కోర్ట్ ఫర్ ట్రయిల్ అఫ్ ఎస్సి, ఎస్టీ కేసెస్ కమ్ సెకండ్ ఏడిజే కోర్ట్ గురువారం తీర్పునిచ్చింది. కథనం ప్రకారం.. మాడ్గులపల్లి మండలం కుక్కడo గ్రామానికి చెందిన నకిరేకంటి శ్రీను, నకిరేకంటి రజిత భార్యభర్తలు.

వీరు ఇరువురు 2020 సంవత్సరంలో వారి యొక్క వరిపోలoలో వరికోత మెషిన్ తో వరి కోయిస్తుండగా ఒక మడి కోసి మరొక మడిలోకి వెళ్తున్న క్రమంలో వారి పక్కనే ఉన్న అదే గ్రామానికి చెందిన బట్టు సైదిరెడ్డి మడిలోకి కోత మెషిన్ పోయింది అని బట్టు సైదిరెడ్డి, అతని కుమారుడు బట్టు మహేందర్ రెడ్డి, సైదిరెడ్డి భార్య బట్టు లక్సమమ్మా ముగ్గురు కలిసి నకిరేకంటి శ్రీను ను కులం పేరుతో దూషిస్తూ, దాడి చేయగా నకిరేకంటి శ్రీను చేయి కి తీవ్ర గాయం అయింది అని అతని భార్య నకిరేకంటి రజిత మాడ్గులపల్లి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది.

అప్పుడు ఉన్న SI ఆర్. నాగరాజు కేసు నమోదు చేయగా, అప్పుడున్న మిర్యాలగూడ డి.ఎస్.పి వెంకటేశ్వర రావు విచారణ చేపట్టి నల్గొండ SC, ST కోర్ట్ లో ఛార్జ్ షీట్ దాఖలు చేసారు. విచారణ అనంతరం ఒక్కొక్కరికి కులం పేరుతో దూషించునందుకు 6 నెలలు, రూ. 1000/- రూపాయలు జరిమానా మరియు దాడి చేసినందుకు ఒక్కొక్కరికి 6నెలలు జైలు శిక్ష మరియు రూ.1000/- రూపాయలు జరిమానా విదిస్తూ, రెండు శిక్షలు ఏక కాలం లో అమలు అయ్యేలా నల్గొండ Special జడ్జి ఫర్ ఎస్సి, ఎస్టీ కేసెస్ కమ్ సెకండ్ ఏ డి జే కోర్ట్ జడ్జి రోజారమణి గురువారం తీర్పునిచ్చారు.

ప్రొసీక్యూషన్ తరపున పీపీ అఖిల వాదించారు. ఈ కేసు లో సాక్షులను సకాలంలో ప్రవేశ పెట్టి ప్రొసీక్యూషన్ కి సహకరించిన కోర్ట్ కాన్స్టేబుల్ డి. కిరణ్ కుమార్ ని మాడ్గులపల్లి SI S. కృష్ణయ్య, మిర్యాలగూడ రూరల్ CI ప్రసాద్, మిర్యాలగూడ DSP రాజశేఖర రాజు అభినందించారు.

MOST READ :

  1. District collector : విద్యార్థుల నైపుణ్య ప్రదర్శన బేష్.. జిల్లా కలెక్టర్ అభినందన..!

  2. Nalgonda : ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు.. కామాంధుడికి 27 ఏళ్ల జైలు శిక్ష..!

  3. Ration Cards : పేదలకు శుభవార్త.. కొత్త రేషన్ కార్డులు ఎప్పటినుంచంటే.. వారికి కూడా సన్న బియ్యం..!

  4. UPI : గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే.. ఎందుకో తెలుసుకోండి..!

  5. Rythu Bharosa : రైతు భరోసా రాలేదా.. అందని వారికి కీలక సూచన..!

మరిన్ని వార్తలు