Devarakonda : చిరు వ్యాపారులకు సీరియస్ వార్నింగ్.. బందోబస్తు మధ్య రోడ్లపై తోపుడు బండ్ల తొలగింపు..!
Devarakonda : చిరు వ్యాపారులకు సీరియస్ వార్నింగ్.. బందోబస్తు మధ్య రోడ్లపై తోపుడు బండ్ల తొలగింపు..!
దేవరకొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలిగేలాగా వాహన దారులకు, పాదాచారులకు ఇబ్బంది కలిగేలాగా రోడ్డు ను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలపై శనివారం దేవరకొండ మున్సిపల్ అధికారులు పోలీస్ సీబ్బంది సహకారంతో తోపుడు బండ్లను తొలగించారు.
దేవరకొండ పట్టణంలో మనోజ్ థియేటర్ నుంచి డిండి ఎక్స్ రోడ్ వరకు చిరు వ్యాపారులు రోడ్డు మధ్య లో దుకాణాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వ్యాపారులు వారి దుకాణాల ముందు రోడ్డు ను ఆక్రమించి వస్తువులను పెట్టడం వలన వాహనదారులకు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడటమే కాకుండా ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలుగుతున్నది. దేవరకొండ కోర్టు నుండి డిండి రోడ్డు వరకు రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన కూరగాయల, ఇతర దుకాణాల ను తొలిగించడం జరిగింది.
దేవరకొండ పట్టణంలో వ్యాపారులు వారి షాప్ ల ముందు రోడ్డు ని ఆక్రమించి వస్తువులను ఉంచడం వలన రోడ్డు ఇరుకుగా మారి వాహనదారులకు, పాద చారులకు తీవ్ర ఇబ్బందులు కల్గుతున్నందువల్ల రోడ్డు ఆక్రమించి ఏర్పాటు చేసిన వస్తువులను మున్సిపల్ సిబ్బంది అక్కడి నుండి తొలగించడం జరిగింది.
దేవరకొండ ఎస్సై మౌనిక వ్యాపారస్తులకు పలు సూచనలు చేయడం జరిగింది. రోడ్డు మధ్యలో చిరు వ్యాపారాలు చేయడం వలన ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని, ఎవరు కూడా రోడ్డు మధ్యలో చిరు వ్యాపారాలు నిర్వహించరాదన్నారు. వ్యాపారస్తులు వారి దుకాణాల ముందు రోడ్డుని ఆక్రమించి వారి వస్తువులను పెడుతున్నారని, కొనుగోలుదారులకు, వాహన దారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు.
ప్రతి వ్యాపారస్తుడు తన దుకాణం పరిధి మేరకే వారి వస్తువులను పెట్టుకోవాలి, రోడ్డు ని ఆక్రమించి వారి వస్తువుల ను పెట్టినట్లయితే వారి వస్తువులను తొలగించడమే కాకుండా మున్సిపల్ అధికారుల సహకారంతో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై విల్సన్, టిపిబిఓ వర్షిత , డిపిఓ శ్రీధర్, మున్సిపల్ సిబ్బంది, శరత్, వినయ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
MOST READ :
-
District SP : జిల్లా ఎస్పీ సంచలన నిర్ణయం.. నకిలీ విత్తనాలు అమ్మితే పి.డి యాక్ట్..!
-
CM Revanth Reddy : కుల గణన పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..!
-
TG News : బీఆర్ఎస్ అంటే.. డాడీ, డాటర్, సన్ పార్టీ.. కవిత లేఖ ఓ డ్రామా.. కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్.. ఫోన్ కు మెసేజ్ కూడా.. ఎప్పుడంటే..!









