Hyderabad : హైదరాబాదులో ఘోరం.. గోడ కూలి ఏడుగురు మృతి..!
Hyderabad : హైదరాబాదులో ఘోరం.. గోడ కూలి ఏడుగురు మృతి..!
మన సాక్షి , హైదరాబాద్ :
హైదరాబాదులో ఘోరమైన ప్రమాదం సంభవించింది. హైదరాబాదులో గోడ కూలి ఏడుగురు మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. హైదరాబాదులోని బాచుపల్లి లో ఘోరమైన సంఘటన జరిగింది.
హైదరాబాదులో మంగళవారం కురిసిన భారీ వర్షానికి బాచుపల్లి లోని రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్మెంట్ గోడ కూలింది. అపార్ట్మెంట్ పక్కనే ఉన్న ఏడుగురు కార్మికులు మృతి చెందారు. మృతులు ఒడిశా, చత్తీస్గడ్ రాష్ట్రాలకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.
మృతుల్లో ఓ మహిళ నాలుగు సంవత్సరాల బాలుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దానిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
సీఎం దిగ్బ్రాంతి :
అపార్ట్మెంట్ పక్కన పనిచేస్తున్న కార్మికులు ఏడుగురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్మికుల దుర్మరణం పాల్పడటంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాన్ని కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశం జారీ చేశారు.
ALSO READ :
Breaking News : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. వారి ఎకౌంట్ల లోకి పదివేల రూపాయలు..!
WhatsApp : ఇండియాలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయా.. కారణం ఏంటి..?









