viralBreaking NewsTOP STORIESవిద్య

Viral News : ఏడవ తరగతి కుర్రాడి లీవ్ లెటర్.. చదివితే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే..!

Viral News : ఏడవ తరగతి కుర్రాడి లీవ్ లెటర్.. చదివితే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే..!

మన సాక్షి, వెబ్ డెస్క్;

ఈ కాలం పిల్లల చదువు ఎలా ఉందంటే చిత్ర విచిత్రంగా ఉంటుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి పిల్లలను తల్లిదండ్రులు స్కూలుకు పంపడమే పెద్ద సమస్యగా మారుతుంది. ఇక స్కూల్ కి వెళ్ళాక చదువుల సంగతి ఎలా ఉంటుందో చెప్పనక్కరలేదు.

తాజాగా ఓ కుర్రాడు తన స్కూల్ ప్రిన్సిపాల్ కు రాసిన లీవ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ లీవ్ లెటర్ రాసిన పద్ధతి చూస్తే ఎవరికైనా నవ్వాగదు. rolex_0064 ఇంస్టాగ్రామ్ లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అయిన ఆ వీడియో ఏడవ తరగతి విద్యార్థి ప్రిన్సిపాల్ కు రాసిన లెటర్.

అదేంటంటే డియర్ మేడం.. అని రాసి “నేను రాను” అని రాశాడు. ఆ తర్వాత రెండో లైన్లో “నేను రాను” “నేను రాను” అని రెండుసార్లు రాశాడు. థాంక్యూ అని రాసిన తర్వాత కూడా “నేను రాను” అని మళ్లీ రాశాడు. చివర్లో సంతకం పెట్టి తేదీ వేశాడు. ఈ లెటర్ ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది.

https://www.instagram.com/reel/C-O7DYUoGfU/?igsh=dnQ3cjc0d2h0bjV6

 

మరిన్ని వార్తలు