BREAKING : చంద్రబాబుతో షర్మిల భేటీ.. అనంతరం కీలక వ్యాఖ్యలు..!
BREAKING : చంద్రబాబుతో షర్మిల భేటీ.. అనంతరం కీలక వ్యాఖ్యలు..!
అమరావతి , మన సాక్షి :
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ,ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ పార్టీ నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైయస్ షర్మిల శనివారం భేటీ అయ్యారు. ఆమె చంద్రబాబు నివాసానికి వెళ్లి తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి హాజరు కావలసిందిగా చంద్రబాబు నాయుడును కోరారు.
వాస్తవానికి ఆమె తన కుమారుడి వివాహానికి ఆహ్వానం పలికేందుకు వెళ్లినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి రాజకీయంగా ప్రత్యార్థులైనప్పటికీ మంచి సంబంధాలు ఏమీ లేవు. అయినా కూడా ఆమె వెళ్లి చంద్రబాబు నాయుడు కు ఆహ్వాన పత్రం అందజేయడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది. చంద్రబాబుతో వైఎస్ షర్మిల కొంతసేపు భేటీ అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ALSO READ : Free Bus Travel : ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త నిబంధనలు.. పాటించకపోతే రూ 500 ఫైన్..!
వైఎస్ షర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడిన అంశాలు యధావిధిగా
– వైఎస్సార్ మనవడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి చంద్రబాబు గారిని ఆహ్వానించాం.
– పెళ్లికి వచ్చి ఆశీర్వదించాలని కోరాను.
– వైఎస్సార్ తో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి చాలా సేపు చర్చ జరిగింది.
– వైఎస్సార్ గురించి చాలా గొప్పగా చెప్పారు.
– రాజకీయ జీవితంలో వైఎస్సార్ తో ఉన్న అనుభవాలు అన్ని పంచుకున్నారు.
– కాంగ్రెస్ పార్టీ ఏ భాద్యతలు ఇచ్చినా నిర్వర్తిస్తం.
– రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాలి.రాహుల్ ప్రధాని అయితేనే ఈ దేశం బాగుపడుతుంది.
– రాహుల్ ను ప్రధాని చేయడమే వైఎస్సార్ లక్ష్యం.
– నాకు భాద్యతలు ఇచ్చిన అంశం బట్టి చేరికల మీద తర్వాత చెప్తాం.
– చంద్రబాబు ను కలవడం రాజకీయం చేయాల్సిన అవసరం లేదు.
ALSO READ : నల్గొండ : అతడు డ్రైవింగ్.. ఆమె స్నాచింగ్..!
– నేను గతంలో క్రిస్మస్ కేకు పంపితే తప్పు పట్టారు.
– నేను చంద్రబాబు కే కాదు అందరికీ పంపాం.
– ఇక్కడ కేటీఆర్, హరీష్, కవితకి కూడా పంపా.
– రాజకీయాలు అన్నది జీవితాలు కాదు.
– రాజకీయాలు ప్రజల కోసం చేస్తున్న సర్వీస్.
– రాజకీయాలు అనేది మా ప్రొఫెషన్.
– ఈ క్రమంలో ఒకరిని ఒకరు మాటలు అనుకుంటాం.
– కేవలం రాజకీయ ప్రత్యర్ధులం మాత్రమే.
– అందరం ప్రజల కోసమే పని చేయాలి.
– పండుగకో,లేదా పెళ్లికి కేకు లాంటివి పంపిస్తే తప్పు పట్టాల్సిన అవసరం లేదు.
– ఇప్పుడు చంద్రబాబును కేవలం పెళ్లికి మాత్రమే పిలవడానికి వచ్చాం.
– చంద్రబాబు ఒక పార్టీకి అధ్యక్షుడు, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త.
– మాకు రాజకీయంగా ఎటువంటి లావాదేవీలు లేవు.
– వైఎస్సార్ తన బిడ్డల పెళ్లికి చంద్రబాబు ను పిలిచారు.
– మా పెళ్లిళ్లకు చంద్రబాబు వచ్చారు..దీవించారు.
ALSO READ: VTG CET : వీటి జి సెట్ -2024 పోస్టర్ల ను విడుదల చేసిన జిల్లా కలెక్టర్..!









