VTG CET : వీటి జి సెట్ -2024 పోస్టర్ల ను విడుదల చేసిన జిల్లా కలెక్టర్..!

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 5వ తరగతి లో ప్రవేశాల కోసం వి టి జి సెట్-2024 నిర్వహిస్తున్న ఉమ్మడి ప్రవేశ పరీక్ష కు సంబందించిన ప్రచార పోస్టర్లను మంగళ వారo జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హల్ లో కలెక్టర్ కోయ శ్రీ హర్ష విడుదల చేశారు.

VTG CET : వీటి జి సెట్ -2024 పోస్టర్ల ను విడుదల చేసిన జిల్లా కలెక్టర్..!

నారాయణపేట టౌన్,  మనసాక్షి :

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 5వ తరగతి లో ప్రవేశాల కోసం వి టి జి సెట్-2024 నిర్వహిస్తున్న ఉమ్మడి ప్రవేశ పరీక్ష కు సంబందించిన ప్రచార పోస్టర్లను మంగళ వారo జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హల్ లో కలెక్టర్ కోయ శ్రీ హర్ష విడుదల చేశారు.

ఈ పరీక్షను 2024-25 విద్యాసంవత్సరానికి గాను అన్ని గురుకులాల్లో అనగా టీఎస్ డబ్ల్యూ ఆర్, టి టి యు ఆర్, టి ఆర్ ఈ ఐ4, ఎం జె పి టి బి సి డబ్ల్యూ ఆర్ 5వ తరగతి ప్రవేశానికి తేది 11.02. 2024 రోజున ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ప్రత్యేక కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయ కర్త దేవ సేన తెలిపారు.

ఈ పరీక్ష ఓ ఎం అర్ ఆదారిత పరీక్ష అని, దీనిలో 100 మార్కుల గాను బహుళైచ్ఛిక ప్రశ్నలను ఇస్తారని ఆమె తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష కు ఈ నెల 6 లోపు విద్యార్థులు ఆన్లైన్ లో సంబంధిత వెబ్ సైట్ ల లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

ALSO READ : Upi Rules : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు అలర్ట్.. కొత్త సంవత్సరం నుంచి మారిన రూల్స్ .. చూడండి..!