Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్జాతీయంటెక్నాలజీతెలంగాణ

Upi Rules : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు అలర్ట్.. కొత్త సంవత్సరం నుంచి మారిన రూల్స్ .. చూడండి..!

Upi Rules : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు అలర్ట్.. కొత్త సంవత్సరం నుంచి మారిన రూల్స్ .. చూడండి..!

మనసాక్షి , వెబ్ డెస్క్ :

దేశంలో డిజిటల్ పేమెంట్ ల వ్యవస్థ రోజురోజుకు విస్తరిస్తుంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు గూగుల్ పే , ఫోన్ పే తో పాటు ఇతర యాప్స్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. చిన్నచిన్న మొత్తం తో పాటు పెద్ద మొత్తంలో కూడా యూపీఐ ద్వారానే డబ్బులు పంపుతున్నారు. అయితే యూపీఐ ద్వారా పేమెంట్ చేసే వారికి అలర్ట్ ను ప్రకటించింది.

నూతన సంవత్సరం 2024 జనవరి 1వ తేదీ నుంచి యూపీఐ పేమెంట్ లలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. జనవరి ఒకటవ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ , పెద్ద మొత్తంలో డబ్బులు పంపడంపై టైం లిమిట్ వంటి కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం…

ALSO READ : Telangana : మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంలో కీలక మార్పులు.. 2024 జనవరి 1 నుంచి ఆ స్కీమ్స్ ఉపసంహరణ..!

యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ లో మార్పు :

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) యూపీఐ ట్రాన్సాక్షన్ లో పరిమితిని పెంచింది. ఒక రోజులో ఒక లక్ష రూపాయలకు పెంచింది. అంటే రోజుకు ఒక లక్ష రూపాయల వరకు పేమెంట్స్ చేయవచ్చును. అలాగే విద్య, ఆరోగ్యం కోసం యూపీఐ పేమెంట్ ల పరిమితిని ఒక లక్ష నుంచి ఐదు లక్షల వరకు పెంచింది. ఈ నిబంధనలు జనవరి ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కాగా ఆసుపత్రులు, విద్యాసంస్థలకు చెల్లింపులను ఐదు లక్షల రూపాయల వరకు యూపీఐ ద్వారానే పంపవచ్చును.

ఉచితంగా యూపీఐ ట్రాన్సాక్షన్ :

ఆన్ లైన్ వ్యాలెట్ల వంటి ప్రీపెయిడ్ చెల్లింపులు 2000 రూపాయల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు యూపీఐ లావాదేవీల కోసం 1.1 శాతం మేర ఇంటర్ చేంజ్ ఫీజులు వసూలు చేస్తారు. మర్చంట్ లావాదేవీలు జరిగినప్పుడు వ్యాపారి నుంచి ఈ చార్జీలు వసూలు చేస్తారు. కానీ ఉచితంగా ట్రాన్సాక్షన్ చేయొచ్చును.

తప్పుడు యూపీఐ కి పొరపాటున డబ్బు పంపితే:

ఇటీవల కాలంలో పొరపాటున తప్పుడు యూపిఐ ఐడి కి డబ్బులు పంపే వారి సంఖ్య పెరుగుతుంది. దానివల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దానిని నివారించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ ట్రాన్సాక్షన్ పూర్తయ్యేందుకు నాలుగు గంటల పరిమితిని విధించింది. ఓకే UPI చేసిన రెండు వేల రూపాయల కంటే ఎక్కువగా.. మొదటిసారి నగదు బదిలీ చేస్తే ఇది వర్తిస్తుంది.

ALSO READ : రేషన్ కార్డుదారులకు బిగ్ రిలీఫ్.. కేవైసీ గడవు పెంచిన ప్రభుత్వం..!

అంటే మీరు పంపిన డబ్బు ఎదుటివారికి చేరడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. ఒకవేళ పొరపాటున వేరే వారికి పంపిస్తే మీ డబ్బులు ఉపసంహరించుకోవడానికి నాలుగు గంటల సమయం ఉంటుంది. అందుకోసం దీనిని కొత్తగా తీసుకువచ్చారు. ఇలాంటి వాటి వల్ల వినియోగదారులకు చాలా ఉపయోగంగా ఉంటుంది.

వాడని యూపీఐలు రద్దు :

ఒక సంవత్సరానికి పైగా యూపీఐ ఐడి లను వినియోగించుకుంటే వాటిని రద్దు చేయనున్నారు. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే తో పాటు ఇతర యాప్ లు, బ్యాంకులు అలాంటి యూపీఐ ఐడి లను రద్దు చేయాలని ఎన్పీసీఐ ఆదేశించింది.

ALSO READ : పాపం పసిబాలుడు.. సెకన్ల వ్యవధిలో తల్లి ఒడి నుంచి మృత్యు ఒడిలోకి..!

మరిన్ని వార్తలు