నదిలో మునిగిన గొర్రెల కాపరి మృతి

నదిలో మునిగిన గొర్రెల కాపరి మృతి

కంగ్టి, మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం లోని కంగ్టి మండల పరిధిలోని నాగూర్ (బి) గ్రామానికి చెందిన హుల్గొండ (16 ) నదిలో మునిగి మృతి శనివారం చెందాడు. బాన్స్వాడ ప్రభుత్వాసుపత్రిలో పోస్ట్మాస్టర్ నిర్వహించి ఆదివారం స్వగ్రామమైన నాగూర్ బీలో అంతక్రియలు నిర్వహించారు.

 

గ్రామస్తులు తెలిపిన ప్రకారం హుల్గొండ తమ తోటి వారితో కలిసి నిజామాబాద్ జిల్లా బీర్కూర్ ప్రాంతంలో గొర్రెలు మేపుతున్నాడు . ఈ శివారులో పక్కనే ఉన్న నదిలో నీళ్లు తాగడానికి వెళ్లి కాలుజారి అందులో మునిగాడు .

 

విషయాన్ని తోటి వారు గుర్తించి మృతదేహాన్ని వెలికి తీశారు. దాంతో ఈ కుటుంబంలో విషాదం నెలకొంది. ఇప్పటికైనా గొర్రెల కాపర్లు నది తీరా ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని గొల్ల కురుమ నేతలు పోలీసులు సూచించారు.