తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు

Miryalaguda : శివనామ స్మరణతో మార్మోగిన శివాలయాలు.. ఎమ్మెల్యే దంపతుల ప్రత్యేక పూజలు..!

Miryalaguda : శివనామ స్మరణతో మార్మోగిన శివాలయాలు.. ఎమ్మెల్యే దంపతుల ప్రత్యేక పూజలు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని మిర్యాలగూడ నియోజకవర్గంలో శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగాయి. బుధవారం తెల్లవారుజాము నుంచే శివాలయాలలో అర్చనలు, అభిషేకాలతో భక్తులు కీటకిటలాడారు. శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి దంపతులు నియోజకవర్గంలోని పలు శివాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శివలింగానికి అభిషేకం నిర్వహించారు.  బోటింగ్ పార్క్ వద్ద ఉన్న ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శాగ జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు.

వేములపల్లి మండల కేంద్రంలో శ్రీ శ్రీ శంభు లింగేశ్వర స్వామి వారి దేవాలయంలో కుటుంబసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆడవిదేవులపల్లి మండలంలో శ్రీ పంచాయతన పార్వతీ పరమేశ్వర దేవస్థానము, వాడపల్లి లో కొలువై ఉన్న శ్రీ అగస్త్యేశ్వర స్వామి వారి దేవాలయం. దామరచర్ల మండలంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం దర్శించుకున్నారు.

అనంతరం మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలోని రామలింగేశ్వర స్వామి దర్శించుకొని అనంతరం మిర్యాలగూడ పట్టణంలోని పార్వతి పరమేశ్వర ఆలయం, శ్రీ ఉమా మహేశ్వర దేవాలయం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు స్కైలాబ్ నాయక్, పొదిల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, శాగ జలేందర్ రెడ్డి, జయలక్ష్మి, దేశిడి శేఖర్ రెడ్డి, గంధం రామకృష్ణ, గోదాల జానకి రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Indiramma Atmiya Bharosa : రైతు కూలీలకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో డబ్బులు జమ..!

  2. Gold Price : చాలా రోజుల తర్వాత.. భారీగా పడిపోయిన పసిడి ధర..!

  3. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. విధుల పట్టణ నిర్లక్ష్యం వహించిన తహసిల్దార్ సస్పెండ్..!

  4. Mega Job Mela : మెగా జాబ్ మేళా.. 100 కంపెనీలు, 20వేల ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా..!

  5. TGSRTC : ఆర్టీసీలో 1500 మంది నియామకం.. సర్క్యులర్ విడుదల..!

మరిన్ని వార్తలు