తెలంగాణBreaking Newsవైద్యంహైదరాబాద్

Gold Price : సంక్రాంతికి మహిళలకు షాక్.. మళ్లీ పెరిగిన గోల్డ్ ధర..!

Gold Price : సంక్రాంతికి మహిళలకు షాక్.. మళ్లీ పెరిగిన గోల్డ్ ధర..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

సంక్రాంతి పండుగకు మహిళలకు బంగారం ధరలు షాక్ ఇచ్చాయి. కొత్త సంవత్సరంలో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. తులం బంగారం 80 వేల రూపాయల మార్కు కూడా దాటేసింది. సామాన్యులకు బంగారం అందుబాటులో లేకుండా పోయింది. ఇంకా పెరుగుతుందేమోనని మహిళలు ఆందోళనలో ఉన్నారు.

వరుసగా పెరుగుతున్న బంగారం ధరలతో బంగారం ప్రియులు షాక్ తింటున్నారు. సోమవారం ఒక్క రోజే 100 గ్రాముల బంగారంకు 4300 రూపాయలు పెరిగింది.

ఆదివారం 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంకు 7,96,400 రూపాయలు ఉండగా సోమవారం 4300 రూపాయలు పెరిగి 8,00,700 రూపాయలుగా ఉంది. అదేవిధంగా 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారు ఆదివారం 7,30,000 సోమవారం 4వేల రూపాయలు పెరిగి 7,34,000గా ఉంది.

హైదరాబాదులో 10 గ్రాముల తులం 24 క్యారెట్ బంగారం 80,070 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ బంగారం 73,400 రూపాయలు ఉంది. హైదరాబాదులో ఉన్న బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఉన్నాయి.

Similr News : 

మరిన్ని వార్తలు