ఎలక్ట్రిక్, గృహాపకారణాలు కొన్నప్పుడు సిలికా జెల్ ప్యాకెట్లు వస్తాయి.. అవి పారేసే ముందు ఒక్క నిమిషం..!
మనం కొత్తగా హ్యాండ్ బ్యాగులు, స్మార్ట్‌ఫోన్లు లేదా షూస్ కొన్నప్పుడు వాటి బాక్సుల్లో చిన్న చిన్న తెల్లటి సిలికా జెల్ ప్యాకెట్లు కనిపిస్తుంటాయి. చాలా మంది ఇవి అనవసరమైనవి అని భావించి వెంటనే డస్ట్‌బిన్‌లో పారేస్తుంటారు.

ఎలక్ట్రిక్, గృహాపకారణాలు కొన్నప్పుడు సిలికా జెల్ ప్యాకెట్లు వస్తాయి.. అవి పారేసే ముందు ఒక్క నిమిషం..!
మన సాక్షి :
మనం కొత్తగా హ్యాండ్ బ్యాగులు, స్మార్ట్‌ఫోన్లు లేదా షూస్ కొన్నప్పుడు వాటి బాక్సుల్లో చిన్న చిన్న తెల్లటి సిలికా జెల్ ప్యాకెట్లు కనిపిస్తుంటాయి. చాలా మంది ఇవి అనవసరమైనవి అని భావించి వెంటనే డస్ట్‌బిన్‌లో పారేస్తుంటారు. కానీ నిజానికి ఇవి మన నిత్యజీవితంలో ఎంతో ఖరీదైన వస్తువులను పాడవకుండా కాపాడే అద్భుత సాధనాలు. గాలిలోని తేమను పీల్చుకోవడంలో వీటికి మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు. బ్యాక్టీరియా బూజు పట్టకుండా చూడటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. మీ వార్డ్‌రోబ్‌లలో లేదా షూ రాక్‌లలో వీటిని ఉంచడం వల్ల దుర్వాసన మాయమవడమే కాకుండా, కీటకాలు దరిచేరకుండా ఉంటాయి.
జ్ఞాపకాలను పత్రాలను పదిలంగా ఉంచే మార్గం మనం ఎంతో ఇష్టంగా దాచుకున్న పాత ఫోటో ఆల్బమ్‌లు కాలక్రమేణా గాలిలోని తేమ వల్ల రంగు మారిపోతుంటాయి. ఫోటోల మధ్యలో లేదా ఆల్బమ్ బ్యాగులో రెండు సిలికా జెల్ ప్యాకెట్లను ఉంచితే, అవి తేమను గ్రహించి ఫోటోలు పదికాలాల పాటు పదిలంగా ఉండేలా చూస్తాయి. కేవలం ఫోటోలే కాకుండా, మన విద్యా ధృవీకరణ పత్రాలు (Certificates), బాండ్లు ఇతర విలువైన దస్త్రాలు ఉంచే ఫైళ్లలో వీటిని పెడితే కాగితాలు చెమ్మగిల్లకుండా ఉంటాయి. దీనివల్ల అక్షరాలు చెరిగిపోకుండా, కాగితం నాణ్యత తగ్గకుండా ఉంటుంది. ఇలాంటి చిన్న ప్యాకెట్లు మన ముఖ్యమైన డాక్యుమెంట్ల రక్షణలో కవచంలా పనిచేస్తాయి.
ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాలకు దీర్ఘకాలిక రక్షణ కెమెరాలు, లెన్స్‌లు వంటి సెన్సిటివ్ ఎలక్ట్రానిక్ వస్తువులను అప్పుడప్పుడు మాత్రమే వాడుతుంటాం. అలాంటి వస్తువులను భదర్శపరిచే బాక్సులలో ఈ సిలికా జెల్ ప్యాకెట్లను ఉంచడం వల్ల లోపల తేమ చేరదు. ఫలితంగా సర్క్యూట్లు తుప్పు పట్టకుండా వస్తువులు దీర్ఘకాలం మన్నికగా ఉంటాయి. అలాగే ఇంట్లోని కాటన్ వస్త్రాలు, టవల్స్ నిల్వ ఉంచినప్పుడు ఒక రకమైన ముక్కిన వాసన వస్తుంది. ఆ వస్త్రాల మధ్య ఈ ప్యాకెట్లను ఉంచితే తేమ గ్రహించబడి బట్టలు ఎప్పుడూ తాజాగా ఉంటాయి. వెండి వస్తువులు ఆభరణాల పెట్టెల్లో వీటిని ఉంచడం వల్ల అవి నల్లబడకుండా మెరుస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని పారేయకుండా తెలివిగా వాడుకోవడం ఉత్తమం.
ఇవి కూడా చదవండి :
- సంపన్న మహిళల రహస్య సూత్రాలు.. మీ ఆర్థిక స్థితిని మార్చేసే గోల్డెన్ టిప్స్..!
- డెంగ్యూ కంటే ప్రమాదకరంగా మారిన అక్రమ దోమల అగర్బత్తీలు!
- District Collector : జిల్లా కీలక ప్రకటన.. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా పటిష్ట చర్యలు..!
- బజాజ్ 100 ఏళ్ల ప్రస్థానం: స్వాతంత్య్ర ఉద్యమ విలువలతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన పారిశ్రామిక దిగ్గజం









