SIR : ఎస్ ఐ ఆర్ పై బూత్ స్థాయి అధికారులకు అవగాహన.!
గుర్రంపోడు మండల కేంద్రంలోని స్థానిక ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్) ప్రాంగణంలో శనివారం బూత్ స్థాయి అధికారులకు (బీఎల్ఓ) 'సర్' యాప్ వినియోగంపై ఒక రోజు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు.

SIR : ఎస్ ఐ ఆర్ పై బూత్ స్థాయి అధికారులకు అవగాహన.!
ముఖ్యఅతిథిగా హాజరైన మండల రెవెన్యూ అధికారి కరుణశ్రీ
గుర్రంపోడు, మన సాక్షి :
గుర్రంపోడు మండల కేంద్రంలోని స్థానిక ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్) ప్రాంగణంలో శనివారం బూత్ స్థాయి అధికారులకు (బీఎల్ఓ) ‘సర్’ యాప్ వినియోగంపై ఒక రోజు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుర్రంపోడు మండల రెవెన్యూ అధికారి (ఎమ్మార్వో) ఎన్. కరుణశ్రీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఓటర్ల జాబితా నమోదు, మార్పులు, చేర్పులు,సవరణల ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభతరంగా మార్చేందుకు ఈ ‘సార్’ యాప్ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్క బూత్ స్థాయి అధికారి ఈ సాంకేతికతపై పూర్తి అవగాహన పెంచుకుని, క్షేత్రస్థాయిలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని ఆమె దిశానిర్దేశం చేశారు.
సాంకేతిక లోపాలు రాకుండా యాప్ను ఎలా ఉపయోగించాలో అధికారులకు క్షుణ్ణంగా వివరించారు. ఈ శిక్షణా శిబిరంలో డిప్యూటీ తాసిల్దార్ ఫరీదుద్దీన్, శిక్షకుడు ప్రసాద్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు నజీర్, చెన్నకేశవులు పాల్గొని యాప్ పనితీరుపై ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సూపర్వైజర్లు గోవర్ధన్, యాదగిరి, రామకృష్ణ, సందీప్, శ్రీనివాస్, కంప్యూటర్ ఆపరేటర్ ఈర్ల శివ, మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన బూత్ స్థాయి అధికారులు, రెవెన్యూ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









