రాష్ట్ర సమస్యలు పరిష్కరించండి.. అమిత్ షాను కలిసిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క..!

తెలంగాణలోని పలు సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని కోరుతూ ఢిల్లీలోని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కలిసి విన్నవించారు

రాష్ట్ర సమస్యలు పరిష్కరించండి.. అమిత్ షాను కలిసిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క..!

మన సాక్షి :

తెలంగాణలోని పలు సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని కోరుతూ ఢిల్లీలోని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

వినతి పత్రంలో పేర్కొన్న సమస్యలు ఇవీ:

– తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TSNAB), తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TSCSB) ఆధునీకరణకు నిధులు మంజూరు చేయాలి.

– 2021 నుండి పెండింగ్ లో ఉన్న ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ అంశాన్ని తక్షణమే సమీక్షించాలి.

– వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల జాబితా నుంచి గతంలో తొలగించిన ఆదిలాబాద్, మంచిర్యాల, కోమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలను SRE (reimbursement of Security Related Expenditure ) పథకం కింద తిరిగి కొనసాగించాలి.

– వామపక్ష తీవ్రవాదుల కార్యకలాపాలను అరికట్టేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయి గ్రామంలో, ములుగు జిల్లా (వి), వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామంలో రెండు సిఆర్‌పిఎఫ్ జెటిఎఫ్ క్యాంపులను ఏర్పాటు చేయాలి.

– నాలుగేళ్లుగా ఎస్పీవో (స్పెషల్ పోలీస్ ఆఫీసర్)లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 60 శాతం వాటా నిధులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా SRE పథకం కింద నాన్-ఎక్స్-ఆర్మీ/పోలీస్‌మెన్ కు చెందిన 1065 మందిని ఎస్పీవో (స్పెషల్ పోలీస్ ఆఫీసర్)లుగా వినియోగించుకోవడానికి నిబంధనలను సవరించాలి.

– తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలి.

ALSO READ : 

TS EAPSET 2024 Counselling : తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రారంభం.. ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి..!

WhatsApp : కొత్త టెక్నాలజీ పై ఫోకస్ పెట్టిన వాట్సప్.. మరో రెండు కొత్త ఫీచర్లు..!