Miryalaguda : సౌత్ జోన్ అథ్లెటిక్స్ సెలక్షన్స్.. సెయింట్ జాన్స్ విద్యార్థుల ఎంపిక..!
Miryalaguda : సౌత్ జోన్ అథ్లెటిక్స్ సెలక్షన్స్.. సెయింట్ జాన్స్ విద్యార్థుల ఎంపిక..!
మిర్యాలగూడ, జూలై 28, మనసాక్షి :
తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆదేశాల మేరకు ఈనెల 28న (సోమవారం) స్థానిక మేకల అభినవ్ స్టేడియంలో నల్లగొండ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 14, 16 బాలబాలికలకు సెలక్షన్స్ నిర్వహించడం జరిగింది. మిర్యాలగూడకు చెందిన సెయిట్ జాన్స్ పాఠశాల విద్యార్థులు రాష్ట్రసాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి ఎంపిక కావడం జరిగింది. పాఠశాలకు చెందిన
వినోద్, షాలిని, పవిత్ర ఆగష్టు 3, 4 న హనుమకొండలో జరగబోయే జరగబోయే రాష్ట్ర స్థాయి సౌత్ జోన్ కు ఎంపిక అయ్యారు. జిల్లాస్థాయి సౌత్ జోన్ పాల్గొన్న విద్యార్థులు పలుక్రీడ అంశాలలో ప్రథమ, ద్వితీయ స్థానాలలో ఎంపిక కావడం వినోద్- లాంగ్ జంప్, షాలిని – హైజంప్, పవిత్ర – జావలిన్ త్రో, తేజశ్రీ బ్యాక్ త్రో, రన్నింగ్, Ekasri – రన్నింగ్ గెలుపొందారు.
సందర్భంగా పాఠశాల ప్రిన్నిపార్ అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు, చదువుతో పాటు, ఆటల్లో చురుకుగా పాల్గొనడం వల్ల శారీరక దారుడ్య పెరుగుదల, మానసిక వికాసం అభివృద్ధి చెందుతుందన్నారు. పాఠశాల కరస్పాండెంట్ శిరిషా మాట్లాడుతూ చక్కని విద్య, కమశిక్షణ పాటిస్తూ – ఆటల్లో ముందుండాలని విద్యార్థులను అభినందించారు.
MOST READ :
-
Miryalaguda : జిల్లాస్థాయి అథ్లెటిక్స్ లో అభ్యాస్ టెక్నో హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ..!
-
Srisailam : శ్రీశైలం, నాగార్జునసాగర్ కు వరద ప్రవాహం.. నిండుకుండలా ప్రాజెక్టులు..!
-
Sub Collector : సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఉమా హారతి..!
-
Nalgonda : 15 నెలల కొడుకుని బస్టాండ్ లో వదిలేసిన యువతి.. ప్రియుడితో జంప్.. సర్వత్రా చర్చ..!









