తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లావైద్యం

నేటి నుండి సదరన్ క్యాంపులు..!

నేటి నుండి సదరన్ క్యాంపులు..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

అర్హులైన దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఛాంబర్ హాల్లో సదరన్ క్యాంప్ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు 2128 దరఖాస్తులు రాగా వాటిలో లోకమోటార్ 1067 ఉన్నాయని డిఆర్డిఏ అధికారిని ప్రశ్నించారు.

ఈ నెల10 నుండి క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ప్రతి బుధ, శుక్రవారాలలో తప్పనిసరిగా సదరన్ క్యాంపులు నిర్వహించాలన్నారు. సదరం సర్టిఫికెట్లను మున్సిపల్ కమిషనర్లు అందజేయాలన్నారు. మెడికల్ కళాశాల చెందిన ఇద్దరు డాక్టర్లు సదరన్ సర్టిఫికెట్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రామ్ కిషన్ ను ఆదేశించారు.

ఈ సమావేశంలో ప్రిన్సిపాల్ రామ్ కిషన్ డిఎంహెచ్వో సౌభాగ్య లక్ష్మి,డి. ఆర్. డి. ఎ. మొఘలాప్ప,డాక్టర్ మల్లికార్జున,ఈ. డి. ఎస్. సి కార్పొరేషన్ ఖలీల్, కమిషనర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LETEST UPDATE : 

Narayanpet : ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

Nalgonda : తప్పుడు పత్రాలతో ఇండ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేసుకున్న జర్నలిస్టులపై చర్య తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు..!

Nelakondapalli : ఖమ్మం జిల్లా ముంపు ప్రాంతాల్లో అధికారుల పర్యటన..!

Runamafi : రుణమాఫీ కాని వారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక ప్రకటన..!

మరిన్ని వార్తలు