TOP STORIESBreaking News

Krishna Floods : ముందస్తుగా నైరుతి.. మురిసిన కృష్ణమ్మ..!

Krishna Floods : ముందస్తుగా నైరుతి.. మురిసిన కృష్ణమ్మ..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

నైరుతి రుతుపవనాలు ముందస్తుగా వచ్చాయి. దాంతో కృష్ణమ్మ పరవళ్ళు ముందస్తుగానే తొక్కుతుంది. మండు వేసవిలో మే నెలలో కూడా ప్రాజెక్టులకు నీరు చేరుతుంది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కృష్ణా బేసిన్ లో భారీ వర్షాలకు కారణంగా జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తారు.

గురువారం రాత్రి జూరాల ప్రాజెక్టుకు ఒక లక్షలు క్యూసెక్కుల వరదనీరు వస్తుండడంతో ప్రాజెక్టు 12 గేట్లను ఎత్తి దిగువకు 83,616 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి దిగువకు విడుదల చేసిన నీరు నేరుగా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుంది. జూరాల ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత 40 సంవత్సరాల కాలంలో మే నెలలో కృష్ణ వరద నీరు రావడం ఇది ఐదోసారి.

18 సంవత్సరాల తర్వాత మే నెలలో తొలిసారిగా జూరాల ప్రాజెక్టుకు వరద నీరు చేరుతుంది. దాంతో 12 గేట్లను ఎత్తిన అధికారులు శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత జలాశయం 8.571 టీఎంసీల నిర్వహింది. జూరాల ప్రాజెక్టు నుంచి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

MOST READ : 

  1. Nalgonda : వాహన తనిఖీల్లో కీలక ఆదేశాలు.. మాడుగులపల్లి చెక్ పోస్ట్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ..!

  2. BaBa Vanga : 2025 లో ఏం జరగబోతోంది.. బాబా వంగా చెప్పిన భవిష్యవాణి ఏంటి.. తీవ్ర ఆందోళన..!

  3. UPI : గూగుల్ పే, ఫోన్ పే లావాదేవీల్లో కొత్త రూల్స్ వచ్చేశాయి.. పేమెంట్స్ ఫెయిల్ అయితే..!

  4. Government : రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. వరి మద్దతు ధర పెంపు..!

మరిన్ని వార్తలు