Nalgonda : వాహన తనిఖీల్లో కీలక ఆదేశాలు.. మాడుగులపల్లి చెక్ పోస్ట్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ..!
Nalgonda : వాహన తనిఖీల్లో కీలక ఆదేశాలు.. మాడుగులపల్లి చెక్ పోస్ట్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ..!
నల్లగొండ, మన సాక్షి:
రానున్న బక్రీద్ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి జిల్లాలో ప్రత్యేక చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయడం జరిగిందని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ పేర్కొన్నారు. గురువారం మడుగులపల్లి చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పశువుల అక్రమ రవాణా నివారణకు అప్రమత్తంగా ఉండాలనీ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. విధుల్లో అప్రమత్తంగా ఉంటూ ప్రతి వెహికల్ ను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు.జిల్లాలో చెక్ పోస్టుల వద్ద 24 గంటలూ పోలీసు సిబ్బంది పర్యవేక్షిస్తూ, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలన్నారు.
ఎవరైనా చట్టవిరుద్ధంగా పశువులను అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పశువుల క్రయ విక్రయాలు జరిపే రైతులు, వ్యాపారులు సంబంధిత గ్రామ పంచాయతీ, మునిసిపల్ అధికారులచే ధృవీకరించబడిన రశీదులను తప్పనిసరిగా కలిగి ఉండాలని అన్నారు.









