క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ కీలక నిర్ణయం.. రూ.1.20 కోట్ల గంజాయి నిర్వీర్యం..!

Suryapet : ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ కీలక నిర్ణయం.. రూ.1.20 కోట్ల గంజాయి నిర్వీర్యం..!

మఠంపల్లి, మన సాక్షి :

సూర్యాపేట జిల్లాలో 44 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 1 కోటి 20 లక్షల రూపాయలు విలువగల 483 కేజీ గంజాయినీ ప్రభుత్వ, కోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ అధ్వర్యంలో సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని నాగర్జున సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం, సిబ్బంది సహాయంతో ప్రభుత్వ సాక్షుల సమక్షంలో ఫ్యాక్టరీకి చెందిన 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగిన కిల్లన్ అనే అత్యాధునిక సాదనంతో గంజాయిని నిర్వీర్యం చేసి బూడిద చేయడం జరిగిందని డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ఈ ప్రక్రియకు పూర్తిస్థాయి భద్రత, రక్షణ చర్యలు తీసుకుని నిభందనలు పాటిస్తూ పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి హనికలగకుండ జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని అన్నారు. అత్యంత భద్రత గల ప్రదేశం అయినందున ఇతరులను అనుమతించలేదు అన్నారు. ప్రజల ఆరోగ్యానికి, సామాజిక భద్రతకు భంగం కలగవద్దు అనే ఉద్దేశ్యంతో నిర్వీర్యం చేశామని తెలిపారు.

ఈ గంజాయిని జిల్లా లో గత సంవత్సర కాలంలో 15 పోలీస్ స్టేషన్ ల పరిధిలో 44 కేసుల్లో సీజ్ చేశామని తెలిపారు.డ్రగ్స్ నివారణ అందరి సామాజిక బాధ్యత,డ్రగ్స్, గంజాయి వినియోగించడం వల్ల యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని. డ్రగ్స్ రవాణా, వినియోగం నేరం అని ఎస్పి అన్నారు. గంజాయి నివారణ లో జిల్లా పోలీసు కృషి చేస్తుంది అన్నారు.

డ్రగ్స్ అమ్మకం, రవాణా, వినియోగం కు సంభందించి పోలీసులకు, డయల్ 100 కు సమాచారం ఇవ్వాలి అన్నారు. డగ్స్, గంజాయి వియోగించే వారిని, వ్యాపారం చేసే వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల అలవాట్లను గమనిస్తూ చెడు వ్యసనాలకు లోనవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధనపు ఎస్పీ నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు సూర్యాపేట డివిజన్ డిఎస్పీ రవి, కోదాడ డివిజన్ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, డిసిఆర్బి డిఎస్పీ మట్టయ్య, హుజూర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమంద రాజు, ఎస్సై పి.బాబు,యాకూబ్, పంచులు పంచాయితీ సెక్రెటరీ లు ,సలీం, మామిడి స్వామి, నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ సిబ్బంది పాల్గొన్నారు.

|MOST READ : 

  1. District collector : ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. కీలక ఆదేశాలు జారీ..!

  2. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్..!

  3. Nalgonda : వ్యవసాయ యోగ్యం కానీ భూముల పరిశీలన పక్కాగా చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

  4. Miryalaguda : ఆ దొంగల రూటే సపరేట్.. ఆంధ్రాలో కొట్టేసి.. తెలంగాణలో విక్రయం..!

  5. Rythu Bharosa : రైతు భరోసా కు అనర్హుల గుర్తింపు.. ప్రారంభమైన క్షేత్రస్థాయి సర్వే..!

మరిన్ని వార్తలు