Miryalaguda : జెవివి టాలెంట్ టెస్ట్ లో రాష్ట్రస్థాయికి ఎంపికైన SPR స్కూల్ విద్యార్థులు..!

Miryalaguda : జెవివి టాలెంట్ టెస్ట్ లో రాష్ట్రస్థాయికి ఎంపికైన SPR స్కూల్ విద్యార్థులు..!
మనసాక్షి, మిర్యాలగూడ :
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన చెకుముకి టాలెంట్ టెస్ట్ జిల్లా స్థాయి పోటీలలో ఎస్ పి ఆర్ స్కూల్ విద్యార్థులు ప్రథమ స్థానం పొంది రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన ఎస్పిఆర్ హై స్కూల్ విద్యార్థులు చెకుముకి టాలెంట్ టెస్ట్ లో రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు స్కూల్ ప్రిన్సిపాల్ జనార్దన్ రెడ్డి తెలిపారు.
స్కూల్ విద్యార్థులు రిత్విక్ (10వ తరగతి), సాయి సింధు (9వ తరగతి) శ్రీ హర్షిత్ (8వ తరగతి) ఉన్నారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్లు జొన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి, నాదెండ్ల అయ్యన్న, యామిని వెంకటేశ్వర్లు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యాబోధన విద్యార్థిని విద్యార్థులకు వారి స్థాయిలను గుర్తించి బోధన చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు టాలెంట్ టెస్ట్ లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీ పరీక్షలతో పాటు క్రీడలలో కూడా తమ పాఠశాల విద్యార్థులు ముందంజలో ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు మెమొంటోలు అందజేసి అభినందించారు.
MOST READ :










