ఆంధ్రప్రదేశ్Breaking Newsపండుగలు

అంగరంగ వైభవంగా శ్రీ గట్టు వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం..!

రామసముద్రం మండలం చంబకూరు గ్రామపంచాయతీలో జరుగుతున్నటువంటి శ్రీ గట్టు వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారి కల్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది.

అంగరంగ వైభవంగా శ్రీ గట్టు వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం..!

రామసముద్రం, మన సాక్షి:

రామసముద్రం మండలం చంబకూరు గ్రామపంచాయతీలో జరుగుతున్నటువంటి శ్రీ గట్టు వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారి కల్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ అర్చకులు, కార్యనిర్వాహకులు స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించి, శాస్రోక్తంగా చెంపకూరు కేంద్రంలో ఎదురుగోలు మెరివిని జరిపారు.

అనంతరం శ్రీ గట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు రామచంద్ర బట్టర్, శంకర స్వామి బృందంచే వేద మంత్రాలతో,అశేష జనసమూహం మధ్య కార్య నిర్వాహకుల ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణంను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అలాగే గరుడ వాహనం పై స్వామి వారు పురవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శన మిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని తిలకించి పునీతులయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా దిగువపల్లి గ్రామస్తులు పెద్ద ఎత్తున గట్టు ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

By : V.Venugopal, Ramasamudram

MOST READ : 

మరిన్ని వార్తలు