Ramasamudram : వైభవంగా శ్రీ కోదండరాముల వారి కళ్యానోత్సవం.. పుష్ప పల్లకి పై ఊరేగింపు..!
Ramasamudram : వైభవంగా శ్రీ కోదండరాముల వారి కళ్యానోత్సవం.. పుష్ప పల్లకి పై ఊరేగింపు..!
రామసముద్రం, మనసాక్షి :
రామసముద్రం మండల కేంద్రంలోని బలిజ వీధిలో వెలిసిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సోమవారం శ్రీరామనవమి 6వ రోజు పురస్కరించుకొని స్వామి వారి కళ్యాణాన్ని అర్చకులు కులశేఖర్ బటర్ అర్చకులు బృందం వారిచే స్వామి శ్రీ కోదండ రాముల వారి కళ్యానోత్సవం ఘనంగా నిర్వహించారు.
గ్రామ పెద్దలు,గ్రామస్థులు ఆధ్వర్యంలో శ్రీకోదండరామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలకు ఫట్టు వస్త్రములు సమర్పించి అలంకరింపజేసి శాస్త్రోక్తంగా మాంగల్య దారణ తంతును ఆలయ అర్చకులు కులశేఖర్ బటర్ ఘనంగా నిర్వహించారు. అనంతరం తలంబ్రాలుగా పోశారు. మహిళలు పెద్ద ఎత్తున ఈ కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఆలయంలో భక్తులకు పాలాభత్తుల సుబ్రహ్మణ్యం వారి కుమారులు చంద్ర,,శీన కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో రెండు రోజులు పాటు అన్న దానం నిర్వహించారు. గ్రామస్థులు ఆధ్వర్యంలో భక్తుల తీర్థ ప్రసాదాలు అందజేశారు.









