నల్గొండBreaking Newsజాతరలుజిల్లా వార్తలుతెలంగాణ

Kanagal : వైభవంగా శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం..!

Kanagal : వైభవంగా శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం..!

కనగల్ , మనసాక్షి :

కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజుల్లుతున్న నల్లగొండ జిల్లా, కనగల్ మండలంలోని ధర్వేశిపురం (పర్వతగిరి) శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ రేణుక ఎల్లమ్మ – జమదగ్ని మహామునిల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. వేద పండితులు డేరం భాస్కర శర్మ ఆధ్వర్యంలో అమ్మవారి కళ్యాణం తంతును వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగింపుగా కళ్యాణ మండపానికి తరలించారు.

అమ్మవారికి ఆలయ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి దంపతులు, ఆలయ ఈవో జల్లేపల్లి జయరామయ్య, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కే. భాస్కర్ లు అమ్మవారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అమ్మవారి లోక కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

భక్తుల కోలాట ప్రదర్శనలు, శివసత్తుల విన్యాసాలు అలరించాయి. భక్తులకు ఆలయం తరఫున అన్నదానం చేశారు. బ్రహ్మోత్సవాల చివరి రోజు శనివారం ధర్వేశిపురం, పర్వతగిరి గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ మాజీ జెడ్పిటిసి గుమ్ముల మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, నల్లగొండ డిఎస్పి శివరామరెడ్డి, సుమతి, ఆలయ మాజీ చైర్మన్ లు గోపాల్ రెడ్డి, యాదగిరి గౌడ్, కృష్ణయ్య, ఆలయ ధర్మకర్తలు నగేష్ గౌడ్, నవీన్ గౌడ్, శంకర్ రెడ్డి, రాజు, నరేష్, వెంకటయ్య, బాబు, రమేష్, దుర్గమ్మ, ఆలయ ముఖ్య అర్చకులు మల్లాచారి, శ్రవణ కుమారాచార్యులు, అర్చకులు ఉమామహేశ్వరరావు, దామోదరరావు, నాగరాజు, ఫణి కుమార్, శ్రీనివాస్, ఆలయ సీనియర్ అసిస్టెంట్ చంద్రయ్య, నాగేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్ ఉపేందర్ రెడ్డి, ఆంజనేయులు, రాజయ్య, శ్రీకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Rythu : తెలంగాణలో రైతులకు అదిరిపోయే మరో కొత్త పథకం.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Rythu Bharosa : రైతు భరోసా, రైతు బీమా పై కీలక నిర్ణయం.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Minister Ponguleti : ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!

  4. WhatsApp : వాట్సాప్ లోకి అనుకున్న సరికొత్త ఫీచర్..!

మరిన్ని వార్తలు