క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nagarjunasagar : నాగార్జునసాగర్ లో బాంబు స్క్వాడ్లు, జాగిలాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు..!

Nagarjunasagar : నాగార్జునసాగర్ లో బాంబు స్క్వాడ్లు, జాగిలాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు..!

నాగార్జనసాగర్, మన సాక్షి :

నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రేపు (2న) నాగార్జునసాగర్ ను సందర్శించనున్నారు.

మొదట వీరు అసెంబ్లీ కార్యక్రమాలు ముగించుకొని తర్వాత బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 3.20 కి బుద్ధ వనానికి చేరుకుని ఆ తరువాత పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ లతో కలిసి 3.40 నిమిషాలకు నాగార్జునసాగర్ ఎడమ కాలువకు వీటిని విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొంటారు.

తరువాత 4.20 నిమిషాలకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ను సందర్శించి శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ కు ఇన్ స్లో గా వస్తున్న వరద ప్రవాహాన్ని పరిశీలించనున్నారు. వెంటనే స్థానిక విజయ్ విహార్ అతిథిగృహం చేరుకొని అక్కడ అల్పాహారం సేవించి సాయంత్రం 5.30 నిమిషాలకు తిరిగి హైదరాబాద్ పయనమవుతారు.

వీరి రాక నిమిత్తము పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసు జాగిలాలతో, బాంబు స్క్వాడ్లతో హెలిపాడ్ పరిసర ప్రాంతాలను తనిఖీలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి : 

Ration Cards : కొత్త రేషన్ కార్డులపై క్యాబినెట్ కీలక నిర్ణయం.. సబ్ కమిటీ ఏర్పాటు..!

Srisailam : శ్రీశైలం వద్ద అధికారుల హై అలర్ట్.. భారీగా పెరిగిన వరద ఉధృతి.. Latest Update

BREAKING : తెలంగాణలో గద్వాల ఎమ్మెల్యే ట్విస్ట్ రాజకీయం.. బుజ్జగింపులకు జూపల్లి భేటీ, అనంతరం హైదరాబాద్ కు..!

మరిన్ని వార్తలు