Breaking Newsక్రీడలుజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ క్రీడాపోటీలకు శిష్య పాఠశాల విద్యార్థులు..!

Miryalaguda : రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ క్రీడాపోటీలకు శిష్య పాఠశాల విద్యార్థులు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మేకల అభినర్ స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి సబ్ జానియర్ అథ్లెటిక్స్ పోటిల్లో మిర్యాలగూడకు చెందిన శిష్య పాఠశాల విద్యార్థులు పాల్గొని మెడల్స్ సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.

కారుణ్య, సంతోష్, (పరుగుపందెం)లో, కీర్తన (జావిలియన్ త్రో ) లో రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగింది. వీరు మంచిర్యాల రాష్ట్రస్థాయిలో జరిగే అథ్లెటిక్స్ క్రీడా పోటీలకు డిసెంబర్ 1 న పాల్గొననున్నారు.

అదేవిధంగా జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు పలు క్రీడ అంశాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో సాధించారు. హరిత, శ్రీవల్లి. సాయిహేమంత్, శివమణి, కార్తీకేయ, అశ్వంత్ కుమార్ (పరుగుపందెం)లో, ఖుశాల్ వర్మ (లాంగ్ జంప్), జ్ఞానేశ్వర్, జోయపర్ట్స్ (షాట్ పుట్) లో మెడల్స్ సాధించారు. మెడల్స్ సాధించిన విద్యార్థులను అభినందించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ అల్గుబెల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు, చదువుతోపాటు, ఆటల్లో చురుకుగా పాల్గొనడం వల్ల శారీరక దారుఢ్య పెరుగుదలతో పాటు, మానసిక వికాసం అభివృద్ధి చెందుతుందన్నారు.

పాఠశాల కరస్పాండెంట్ శిరీషా మాట్లాడుతూ చక్కని విద్య, క్రమశిక్షణ పాటిస్తూ ఆటల్లో ముందంజలో ఉండాలని విద్యార్థులను అభినందించారు.
కార్యక్రమంలో పీఈటీ దుర్గాప్రసాద్ విద్యార్థులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.

MOST READ : 

మరిన్ని వార్తలు