నిర్వాసితులకు న్యాయం చేస్తాం – సబ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి
నిర్వాసితులకు న్యాయం చేస్తాం – సబ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి
మెలియాపుట్టి, మనసాక్షి :
అప్షొర్ నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, అందరికీ న్యాయం చేయడం జరుగుతుందని టెక్కలి సబ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం మెలియాపుట్టి మండలం చీపురుపల్లి గ్రామాన్ని సబ్ కలెక్టర్ సందర్శించి నిర్వాసితులతో మాట్లాడారు. ఇటీవల డైవర్షన్ రహదారి నిర్మాణము కు నిర్వాసితులు అడ్డుకోవడంతో పనులు నిలిపివేసి అధికారులు వెనుతిరిగారు.
నిర్వాసితులందరికీ ప్రభుత్వం నుంచి రావలసిన నష్టపరిహారం, ఆర్ఆర్ ప్యాకేజీలు అందించడం జరుగుతుందన్నారు. పలువురు నిర్వాసితులు తమ సమస్యలను పరిష్కరించి పనులు చేయాలని సబ్ కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. నిర్వాసితుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడం జరుగుతుందని ఆందోళన చెందవద్దన్నారు.
ALSO READ :Rayala Telangana : రాయల తెలంగాణ పై మంత్రి జగదీష్ రెడ్డి ఏమన్నాడంటే..?
రిజర్వాయర్ పనులకు నిర్వాసితులు ఆటంకం కలిగించరాదన్నారు. ఆయనతోపాటు తాసిల్దార్ సరోజిని, సర్పంచ్ ఈశ్వరరావు నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు.









