District collector : అంగన్వాడి కేంద్రం ఆకస్మిక తనిఖీ.. పలు కీలక సూచనలు చేసిన జిల్లా కలెక్టర్..!
District collector : అంగన్వాడి కేంద్రం ఆకస్మిక తనిఖీ.. పలు కీలక సూచనలు చేసిన జిల్లా కలెక్టర్..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట జిల్లా కేంద్రంలో నీ బీసీ కాలనీ అంగన్ వాడీ కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో చిన్నారుల విద్యా ప్రమాణాల నైపుణ్యాన్ని ఆమె పరిశీలించారు. కేంద్రంలో అంగన్ వాడీ టీచర్ బోధిస్తున్న పూర్వ ప్రాథమిక విద్యను పర్యవేక్షించారు.
కేంద్రంలో విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారం ( పాలు, గుడ్లు, బాలామృతo ) గురించి ఆరా తీశారు. పాలు, గుడ్లు నాణ్యతగా ఉంటున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. శ్యామ్ మ్యామ్ పిల్లల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు అందుబాటులో ఉన్న బోధనా పరికరాలను పరిశీలించారు. పిల్లలను కింద కాకుండా కుర్చీలలో కూర్చోబెట్టాలని, ఎంత మంది చిన్నారులకు ఎన్ని కుర్చీలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.
ఇంకా ఏమైనా అవసరమైతే సమకూర్చాలని డీ డబ్ల్యు ఓ జయ కు సూచించారు. జిల్లాలో కంటైనర్ లో కొనసాగుతున్న అంగన్ వాడీ కేంద్రాలు ఇది కాకుండా ఇంకా ఎక్కడ ఉన్నాయని డబ్ల్యు ఓ జయ ను ప్రశ్నించగా బీసీ కాలనీ తో పాటు జిల్లాలోని నర్వ మండలం యాంకీ గ్రామంలో మరొకటి ఉందని తెలిపారు. కానీ కంటైనర్ లో కేంద్రాన్ని కొనసాగించడం చాలా ఇబ్బందిగా ఉంటుందని జయ కలెక్టర్ కు విన్నవించారు.
MOST READ ;
-
SBI : లక్షాధికారి కావడం చాలా సింపుల్.. SBI అదిరిపోయే కొత్త స్కీం.. అందరికీ ఉపయోగమే..!
-
Pushpa 2 : పుష్ప సాంగ్ కి బామ్మ అదిరిపోయే స్టెప్పులు.. వీడియో చూడాల్సిందే..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై క్లారిటీ.. అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు.. లేటెస్ట్ అప్డేట్..!
-
Bank Transaction : ఫోన్ పే, గూగుల్ పే ఉందని ఎక్కువ లావాదేవీలు చేస్తున్నారా.. లిమిట్ ఎంతో తెలుసుకోకుంటే కష్టమే..!









