Breaking Newsక్రైంఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

Nelakondapalli : ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య..!

Nelakondapalli : ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య..!

నేలకొండపల్లి, మన సాక్షి :

కుటుంబ కలహాల కారణంగా ఓ వివాహిత ఆత్మహత్య కు పాల్పడిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

ఖమ్నేమం జిల్లా నెలకొండపల్లి మండలం లోని ఆచార్లగూడెం గ్రామానికి చెందిన వైష్ణవి (25) అనే యువతిని సూర్యాపేట జిల్లా, అనంతగిరి మండల కేంద్రం కు చెందిన కొండలు తో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు. కుమార్తె ఉన్నారు.

కొంత కాలం బాగానే ఉన్నారు. ఇటీవల కుటుంబ కలహాలు జరిగాయి. భర్త వేధింపులు పెట్టటంతో నెల రోజలు క్రితం మృతురాలు తల్లిదండ్రుల నివాసమైన. ఆచార్లగూడెం వచ్చి ఉంటుంది.

కుటుంబ కలహాల కారణంగా. గురువారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య కు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి నేలకొండపల్లి ప్రభుత్వ హస్పిటల్ కు తరలించారు. -చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు. బోరున విలపించారు.

MOST READ : 

మరిన్ని వార్తలు