నిప్పులు చెరుగుతున్న సూర్యుడు

నిప్పులు చెరుగుతున్న సూర్యుడు

చర్ల, మనసాక్షి:

చర్ల మండలంలో ఒకానొక టైంలో కరోనా ఫామ్ లో వున్నప్పుడు రెండువేల ఇరవై మార్చి కాలంలో ప్రజలు బయటికి రావాలంటే గతంలో ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకొని గడగడ లాడి పోయిన విషయం అందరికి తెలిసిందే. కానీ ఇప్పుడూ అంతకంటే ఎక్కువ భయంతో ఈ నిప్పురవ్వల వలె భగభగలాడే మండుటెండలను,దిన దిన అభివృద్ధి చెందుతున్న సూర్యుణ్ణి చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

 

ఇంట్లో పడి బిక్కు బిక్కు మంటూ పనులన్నీ ఆపుకొని దిక్కుతోచని స్థితిలో ఉండిపోతున్నారు..భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భగభగలాడే మండుటెండల తీవ్రత ఉష్ణోగ్రతల గరిష్టం స్థాయి ఆదివారం ఉదయం 10 గంటలసమయంలో నే 44.9, కీ చేరుకోవడంతో ప్రజలు భయబ్రాంతులకు గురైన్నట్లు తెలుస్తుంది.. చర్ల మండల కేంద్రం లో ప్రజలు నిత్యవసరాల రిత్యా బయటికి వెళ్లినప్పుడు ఎండలు కొడుతున్నట్టు లేదని నిప్పు రవ్వలు మీద పడినట్లు ఉంటుందని బాధిత ప్రజలు సోమవారం తెలిపారు.

 

ఎప్పుడు నిత్యం రోడ్లుపై ప్రజలతో కలకల్లాడే చర్ల మండల కేంద్రం ఎండలు నిప్పులు చెదురుతున్న కారణంగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు భయంతో రోడ్లన్నీ నిర్మానుషంగా మారిపొతున్నాయి. సాయంత్రం ఐదు దాటిన ఎండ తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. ఇది ఇలా ఉండగా వాతావరణ శాఖ ఎండలు మరింత తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

 

ఈ నిప్పులు చేదురుతున్న ఎండల కారణంగా వడగాలుల కారణంగా ఎన్ని ప్రమాదాలు జరగనున్నాయో వేసి చూడాల్సిందే మరి.చర్లలో అత్యవసరాల రిత్యా మిట్ట మధ్యాహ్నం భగభగలాడే నిప్పు రవ్వల మండుటెండల్లో ఇబ్బంది పడుతూ ప్రయాణం కొనసాగిస్తున్న బాధితులను సోమవారం మనసాక్షి క్లిక్కు మనిపించింది.