తెలంగాణBreaking Newsపెద్దపల్లి జిల్లా

Free Sewing Machine : మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. ఉచిత కుట్టుమిషన్లకు దరఖాస్తు ఇలా..!

Free Sewing Machine : మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. ఉచిత కుట్టుమిషన్లకు దరఖాస్తు ఇలా..!

పెద్దపల్లి, ధర్మారం, మన సాక్షి :

ఉచిత కుట్టు మిషన్ల కోసం దరఖాస్తు చేసుకున్న మైనార్టీ మహిళలు దరఖాస్తు హార్డ్ కాపీలను మార్చి 6వ తేదీ లోపు సమర్పించాలని జిల్లా ఇంఛార్జి మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి జే.రంగా రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారు ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా ఉచిత కుట్టు మిషన్లు అందిస్తున్నారని తెలిపారు.

డిసెంబర్ 16 నుంచి 31 వరకు ఉచిత కుట్టు మిషన్ కొరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయం పెద్దపల్లిలో హార్డ్ కాపీలు ఇవ్వని అభ్యర్థులు మాత్రమే తమ దరఖాస్తు ఫారంతో పాటు సంబంధిత పత్రాలను మార్చి 6 లోపల
సమీకృత జిల్లా కలెక్టరేట్ మొదటి అంతస్తు రూమ్ నెంబర్ 232 లో ఉన్న జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.

ఉచిత కుట్టు మిషన్ల కోసం దరఖాస్తు తో పాటు తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆహార భద్రత కార్డ్ లేదా గ్రామీణ ప్రాంతంలో 1,50,000, పట్టణ ప్రాంతాలు రెండు లక్షలకు పెంచకుండా వార్షికాదాయ ధ్రువీకరణ పత్రం, వయసు రుజువుగా ఆధార్ కార్డు/ఓటర్ ఐడీ కార్డు,తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా కచ్చితంగా టైలరింగ్ కోర్స్ నేర్చుకుని టైలరింగ్ సర్టిఫికెట్ , 5వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ జతచేస్తూ దరఖాస్తుల సమర్పించాలని అన్నారు.

ఒక కుటుంబానికి ఒక కుట్టు మిషన్ మాత్రమే ఇవ్వబడుతుందని, మహిళలు తమ దరఖాస్తు హార్డ్ కాపీలను మార్చి 6 లోగా సమర్పించాలని నిరుద్యోగ నిరుపేద మహిళలు విడాకులు తీసుకున్న మహిళలు వితంతువులు అనాధ మరియు ఒంటరి మహిళలకు ప్రాధాన్య ఇవ్వ పడుతుందని జిల్లా ఇంఛార్జి మైనార్టీ సంక్షేమ అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

  1. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

  2. TG News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలోకి డబ్బులు..!

  3. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఎకౌంట్లలో రూ.1లక్ష.. లేటెస్ట్ అప్డేట్..!

  4. Cm Revanth Reddy : 12 ఏళ్లు అద్దె ఇంట్లో గడిపిన రేవంత్ రెడ్డి.. అ ఇంటికి వెళ్లి భావోద్వేగం..!

  5. Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు