అస్తమించిన కమ్యూనిస్టు దిగ్గజం.. సురవరం సుధాకర్ రెడ్డి..!
అస్తమించిన కమ్యూనిస్టు దిగ్గజం.. సురవరం సుధాకర్ రెడ్డి..!
సంస్థాన్ నారాయణపురం, మన సాక్షి :
సీపీఐ పార్టీ అగ్రనేత, మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లగొండ జిల్లా మాజీ పార్లమెంటు సభ్యుడు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణించడంతో యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి జోహార్ కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి అంటూ శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ సురవరం సుధాకర్ రెడ్డి రైతులు, కార్మికుల పక్షాన బలంగా గళం వినిపించారన్నారు. నల్లగొండ ప్రాంతంలో ఫ్లోరోసిస్, కరవు పరిస్థితులపై పోరాటాలు చేపట్టారని గుర్తు చేశారు. ఆయన మరణం తెలంగాణ రాజకీయాలకు, కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని చెప్పారు.
సురవరం సుధాకర్ రెడ్డి తన జీవితాన్ని ప్రజల కోసం, పేదల అభ్యున్నతి కోసం అంకితం చేశారన్నారు. నల్లగొండ పార్లమెంటు సభ్యుడిగా ఆయన అందించిన సేవలు అపారమైనవని తెలిపారు. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన నిలువుటద్దమని వెల్లడించారు. ఆయన పోరాట స్ఫూర్తి, నిబద్ధత అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. అమరవీరులను స్మరించుకుంటూ కార్యకర్తలు నివాళిలర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చనగోని గాలయ్య, చిలువేరు అంజయ్య, మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్, నారాయణపూర్ గ్రామ కార్యదర్శి పల్లె మల్లారెడ్డి, సీపీఐ సీనియర్ నేతలు దేశిడి నరేందర్ రెడ్డి, యాదయ్య, కలకొండ సంజీవ, మొగుదాల సత్తయ్య, గాలయ్య, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Model School : ఈ మోడల్ స్కూల్ కు రాష్ట్రస్థాయి గుర్తింపు.. ట్రైల్ బ్లేజర్స్ పుస్తకంలో చోటు..!
-
Gold Price : బాబోయ్.. గోల్డ్ ధర ఒక్కరోజే రూ.10,900.. ఈరోజు ధర ఎంతంటే..!
-
Tasildar : తహశీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన రామకృష్ణారెడ్డి ఎవరో తెలుసా..!
-
Dmart : డి మార్ట్ లో అతి తక్కువ చౌక ధరలకు సరుకులు కావాలా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!









