Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsక్రైంతెలంగాణ

Suryapet : సూర్యాపేట జిల్లా ఎస్పీ కీలక సూచన.. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..!

పిర్యాదులు, కేసులు పెండింగ్ ఉంచకుండా త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా ఎస్పి నరసింహ సూచించారు.

Suryapet : సూర్యాపేట జిల్లా ఎస్పీ కీలక సూచన.. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..!

సూర్యాపేట, మనసాక్షి :

పిర్యాదులు, కేసులు పెండింగ్ ఉంచకుండా త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా ఎస్పి నరసింహ సూచించారు. శుక్రవారం సూర్యాపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, సిబ్బంది నిర్వహించిన కవాతును పరిశీలించి, యూనిఫామ్స్ మరియు కిట్లను తనిఖీ చేశారు. సిబ్బందితో వ్యక్తిగతంగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు.

అనంతరం స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, స్టేషన్‌లోని వివిధ రకాల కీలక రికార్డులను, శాంతిభద్రతల నిర్వహణ ఫైళ్లను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. కోర్టులతో సమన్వయంగా పని చేసి ఎక్కువ కేసుల్లో శిక్షలు అమలయ్యేలా కృషి చేయాలని అన్నారు. బాధితులకు రక్షణ, భద్రత కల్పించడం ప్రాథమిక విధి, బాధ్యత అన్నారు. సిబంది విధులను పర్యవేక్షణ చేయాలి సమర్థవంతంగా పని చేసేలా నైపుణ్యాలను వృద్ధి చేయాలను అన్నారు. జిల్లా కేంద్రంలో అప్రమత్తంగా ఉంటూ నేరాలను పటిష్టంగా నిరోధించాలని అన్నారు.

20 సీసీ కెమెరాల ప్రారంభం

ప్రజల రక్షణ మరియు ట్రాఫిక్ నియంత్రణను మరింత బలోపేతం చేయడంలో భాగంగా పట్టణ కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మరో 20 సీసీ కెమెరాలను ఎస్పీ గారు ప్రారంభించారు. వీటిని తక్షణమే కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసినట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ మగ్దూం అలీ, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, ఎస్సైలు ఏడు కొండలు, మహేందర్, శివతేజ, సందీప్, వెంకన్న, రహిముద్దీన, ఏఎస్సై శంకర్, మరియు స్టోర్ ఆర్ఎస్ఐ అఖిల్, డిసిఆర్బి సిబంది ఎస్ఐ యాకూబ్, ఏఎస్ఐ అంజన్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ శేఖర్ రెడ్డి, సీసీ సందీప్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ALSO READ : 

మరిన్ని వార్తలు