Nalgonda : సాదాబైనమా దరఖాస్తులకు రైతుల నుంచి డబ్బులు డిమాండ్.. జిపీఓ సస్పెండ్..!
సాదాబైనామా దరఖాస్తుల క్రమ బద్ధీకరణ విషయంవలో రైతుల నుంచి లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై చిత్తలూరు జీపీఓ ఓర్సు రజితను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ చంద్ర శేఖర్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

Nalgonda : సాదాబైనమా దరఖాస్తులకు రైతుల నుంచి డబ్బులు డిమాండ్.. జిపీఓ సస్పెండ్..!
శాలిగౌరారం, మనసాక్షి :
సాదాబైనామా దరఖాస్తుల క్రమ
బద్ధీకరణ విషయంవలో రైతుల నుంచి లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై చిత్తలూరు జీపీఓ ఓర్సు రజితను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ చంద్ర శేఖర్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలోని చిత్తలూరు రెవెన్యూ క్లస్టర్ జీపీఓగా పనిచేస్తున్న ఓర్సు రజిత చిత్తలూరు, అంభారిపేట, ఊట్కూరు గ్రామాలకు చెందిన పలువురు రైతులకు సంబంధించిన సాదాబైనమా దరఖాస్తులను అమలు చేసేందుకు ఒక్కో రైతు నుంచి రూ.20 వేలు లం చం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఒక్కోక్కరు రూ.3 వేలు జీపీఓకు ముట్టజెప్పారని సమా చారం. చిత్తలూరు గ్రామానికి చెందిన ఓ మహిళా రైతు ఇచ్చిన సమాచారంతో వివిధ మీడియా, సామాజిక మధ్యమాల్లో వచ్చాయి దింతో స్పందించిన కలెక్టర్ అవినీతి ఆరోపణ లపై పూర్తిస్థాయి నివేదికను అందజేయాలని తహ సీల్దార్ మాధవరావును ఆదేశించారు. ఘటనపై నివేదికను తహసీల్దార్ గురువారం సాయంత్రం కలెక్టర్కు అందజేశారు. ఈనేపథ్యంలో జీపీఓ రజితను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.









