అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

చింతపల్లి. మన సాక్షి.

అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన చింతపల్లి మండలం మాల్ వెంకటేశ్వర్ నగర్ లో బుధవారం చాట్ చేసుకుంది. బంధువులు పోలీసులు తెలిపిన వివరాల చింతపల్లి మండల ఒమంతాలపల్లి గ్రామానికి చెందిన పున్న ఆంజనేయులు 59 సంవత్సరాలు మాల్ వెంకటేశ్వర నగర్ లో గత 20 సంవత్సరాల నుండి దర్జీ గా పని చేస్తూ భార్యాపిల్లలతో జీవనం కొనసాగించేవాడు.

 

అయితే గత నాలుగు సంవత్సరాల నుండి భార్య ఇరువురు పిల్లలు ఆంజనేయులు వదిలి దూరంగా ఉంటున్నారు. భార్య పిల్లలు దూరం కావడంతో మతిస్థిమితం సరిగా లేక తీవ్రమ్మనస్తా పనికి గురవుతుండేవాడు. మాల్ బస్టాండ్ సమీపంలో ఉన్న తన స్వేటర్లో నివాసం ఉంటూ ఒక్కడే ఒంటరిగా జీవనం కొనసాగిస్తున్నాడు.

 

గత మూడు రోజుల నుండి ఆంజనేయులు తన రూమ్ స్వెటర్ తీయకపోవడంతో పాటు వ్యక్తి కనిపించకపోవడంతో అతని తమ్ముని కుమారుడు అనుమానం వచ్చి షాపు దగ్గరికి వెళ్లి చూడగా షాపు నుండి దుర్వాసన వస్తుంది. దీంతో అనుమానం వచ్చి స్వెటర్ను తెరిచి చూడగా గుర్తుతెరని పురుగుల మందు సేవించి మృతి చెందినట్లు పోలీసులు బంధువులు వారి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.

 

మృతుని సొంత అన్న పున్న కొండయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి కి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య ఇరువురు పిల్లలు కలిగి ఉన్నారు.