Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
Devarakonda : దేవరకొండ లోని దాబాలో అనుమానాస్పదంగా మృతి..!
Devarakonda : దేవరకొండ లోని దాబాలో అనుమానాస్పదంగా మృతి..!
దేవరకొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని గ్రీన్ గార్డెన్ దాబా లో పనిచేస్తున్న అంకురి బుచ్చయ్య అనుమానాస్పదంగా మృతి చెందినట్లు దాబా నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది.
దేవరకొండ మండలం కొమ్మేపల్లి గ్రామానికి చెందిన అంకూరి బుచ్చయ్య సన్నాఫ్ కాశయ్య (34) గ్రీన్ గార్డెన్ దాబాలో సుమారు నాలుగు, ఐదు సంవత్సరాల నుంచి దాబాలో పనిచేస్తూ అదే దాబాలో అనుమాదస్థితిగా మృతి బంధువులకు అనుమానంగా మారింది.
తల మీద దెబ్బలు ఉండడం వలన అనుమానాలు ఉన్నాయని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
LATEST UPDATE :
Runamafi : రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్.. వారికి కూడా రుణమాఫీ..!









