వలిగొండ : ఈత కొడుతూ ఊపిరాడక వ్యక్తి మృతి

వలిగొండ : ఈత కొడుతూ ఊపిరాడక వ్యక్తి మృతి

వలిగొండ , మన సాక్షి:

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోకారం గ్రామ శివారులో నెలపట్ల రోడ్డులోని వ్యవసాయ వద్ద బావిలో మునిగి వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

 

పోలీసుల కథనం ప్రకారం చౌటుప్పల్ మండలం తంగడపల్లి గ్రామానికి చెందిన పోలేపల్లి అచ్చయ్య తండ్రి చంద్రయ్య యొక్క కుమారుడు పోలేపల్లి నరేష్ (30) కులంsc మాదిగ, వృత్తిరీత్యా సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం గడుపుతుంటాడు.

 

తన స్నేహితుడైన ఊదరి శ్రీకాంత్ టాటా ఏసీ డ్రైవర్తో కలిసి తేదీ 23 మే 2023 రోజున ఏపీ 29ఎస్ 2225 బైక్ మీద గోకారం గ్రామ శివారులోని నేలపట్ల రోడ్డులో గల మద్దేల లక్ష్మయ్య వ్యవసాయ బావిలో ఈత కొడుతూ ఉన్నారు . మధ్యాహ్నం రెండు గంటలకు ఈత కొడుతూ కొడుతూ తర్వాత శ్రీకాంత్ బావి గడ్డమీదికి వచ్చి నరేష్ నువ్వు కూడా పైకి రావాల్సిందిగా పిలిచాడు.

 

అంతలోపే అతను బావిలో మునిగి చనిపోయాడు. ఫిర్యాదుదారుడు పోలేపల్లి అచ్చయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని వలిగొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.